ఇంత నిర్లక్ష్యం ఎందుకు…!

0
3


ఇంత నిర్లక్ష్యం ఎందుకు…!

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: సమ్మె విషయంలో ముఖ్యమంత్రి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ ఐకాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఆర్టీసీ కార్మికులేనని మరిచిపోవద్దని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

న్యాయమనే ముందుకు వెళ్తున్నాం

ఉద్యోగంలో చేరకపోతే అందరిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సరికాదు. నిబంధనల ప్రకారం ముందుకెళ్తున్నాం. ముందుగా ప్రభుత్వానికి, కార్మిక శాఖకు సమ్మె నోటీసు ఇచ్చాం. ప్రభుత్వమే స్పందించలేదు.

నర్సయ్య, ఐకాస నాయకుడు

కార్మికులు భయపడే పరిస్థితిలో లేరు

ముఖ్యమంత్రి కార్మికులను భయపెట్టిస్తే భయపడే పరిస్థితిలో లేరు. ఐదేళ్లుగా శాంతి యుతంగా నిరసన కార్యక్రమాలు చేసి అలసిపోయార. సమస్యలు పరిష్కరించే వరకు ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేరు.

వందేమాతరం శ్రీనివాస్‌, ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌

హైదరాబాద్‌ నుంచి రూ. 500 ఛార్జీ

సమ్మెతో ప్రజలను దోచుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు వాహనంలో వస్తే రూ. 500 ఛార్జీ వసూలు చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బస్సు దిగమని బెదిరించారు. ఇంత అన్యాయమా ..? ఎవరూ పట్టించుకోక పోవడంతో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు.

దిలీప్‌ రెడ్డి, నిజామాబాద్‌

ఇచ్చిన మాట నెరవేర్చాలి

కూర్చొని మాట్లాడితే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేగానీ ఎవరి పట్టు వారు పడితే చివరకు ప్రజలకు నష్టం జరుగుతుంది. నాయకులు సైతం సాధ్యం కాని హామీలు ఏమైనా ఉంటే ముందుగా గుర్తించి తర్వాత హామీలు ఇవ్వాలి.

గంగాధర్‌, నిర్మల్‌

సమస్యలు పరిష్కరిస్తే మంచింది

ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఇటు ప్రజలను, అటు కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. సమస్యకు పరిష్కారం చూపాలి. ప్రజల జేబులకు చిల్లులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి

విజయ, హైదరాబాద్‌Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here