ఇక ఇంటికే పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ

0
0


ఇక ఇంటికే పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ

పెట్రోల్ బంకుల్లో ఆఫీస్ టైంలో పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉంటాయి. చిన్న బంకుల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకునే ధైర్యం చాలా మందికి ఉండదు. అందుకే ఎక్కువగా పెద్ద బంకుల్లోనే పెట్రోల్, డీజిల్ ఫిల్ చేయించుకోవాలని చూస్తారు. కానీ.. బిజీగా ఉన్న నేపధ్యంలో చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక స్కూళ్లు, పెద్ద కంపెనీల బస్సులు, వ్యాన్లకు కూడా మనకంటే ఎక్కువ సమస్యలే ఉంటాయి. అలాంటి వాళ్లకు ఫ్యూయల్‌ను డోర్ డెలివరీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలు.

డిసెంబర్ నాటికి దేశంలో ఇరవై ప్రధాన నగరాల్లో డోర్ స్టెప్ డెలివరీకి ఈ మూడు ప్రభుత్వ సంస్థలూ సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 500 ప్రత్యేక డోర్ స్టెప్ ఫ్యూయల్ వెహికల్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ఈ మూడు సంస్థలూ ప్రకటించాయి.

సూపర్ రెస్పాన్స్

ఇంటికి ఫ్యూయల్‌ను డెలివర్ చేసే ఈ ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని హెచ్. పి.సి.ఎల్ ఛైర్మన్ ఎం.కె. సురానా చెబ్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ కంపెనీలకు డీజిల్‌ను మాత్రమే డోర్ డెలివరీ చేసే అనుమతి దొరికింది. ఎందుకంటే పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫీ (పెసో)అనే సంస్థ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. త్వరలో పెట్రోల్‌కు కూడా క్లియరెన్స్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకాం ప్రస్తుతం 35 నగరాల్లో డీజిల్‌ను తమ ఆఫీసులు, యూనిట్ల దగ్గరకే సరఫరా చేస్తున్నారు. ఇందులో ఇండియన్ ఆయిల్‌ 15, బిపిసిఎల్‌ 13, హెచ్ పి సి ఎల్‌ 7 ప్రాంతాల్లో డీజిల్‌ను డెలివర్ చేస్తోంది.

పెద్ద కస్టమర్లే టార్గెట్

పెద్ద కస్టమర్లే టార్గెట్

మనం లీటర్ పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడానికి అంతదూరం నుంచి వెహికల్స్‌లో కంపెనీలు రావాలంటే కష్టం, అధిక వ్యయం కూడా. అందుకే పెద్ద కస్టమర్లనే ఈ సంస్థలు టార్గెట్ చేశాయి. బల్క్ పర్చేజ్.. అంటే పెద్ద మొత్తంలో డీజిల్‌ అవసరమయ్యే సంస్థలకు ఇది బాగా ఉపయోగప్తుంది. కనీసం 2500 లీటర్ల డీజిల్‌ తీసుకోవాల్సి ఉంటుంది, అదే సమయంలో వాళ్లకు పెసో లైసెన్స్ కూడా ఉండాలి. అప్పుడే వాళ్లకు డోర్ డెలివరీలో డీజిల్ అందజేస్తారు.

కొత్త లైసెన్సులు

కొత్త లైసెన్సులు

త్వరలో ఇండియన్ ఆయిల్‌కు 4, బిపిసిఎల్‌కు 10, హెచ్.పి.సి.ఎల్‌కు 6 నగరాల్లో ఈ లైసెన్సులు అందబోతున్నాయి. వీళ్లంతా ఎక్కువగా ఇండస్ట్రీ ఏరియాలపైనే దృష్టిని పెంచారు. ఎక్కడైతే డీజిల్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుందో వాళ్లను టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఒక్క నవీ ముంబైలోని ఇండస్ట్రీ ఏరియాలో నెలకు 150 కిలో లీటర్ల డీజిల్ అమ్ముడవుతోంది. వీటితో పాటు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ఉదయపూర్ ప్రాంతాల్లో కూడా డీజిల్‌కు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇలాంటి వాళ్ల కోసం ప్రత్యేక డిస్పెన్సింగ్ మెషీన్లను తయారు చేసి మరీ పంపుతున్నాయి ఆయిల్ సంస్థలు.

మరి మన పరిస్థితి

మరి మన పరిస్థితి

రిటైలర్లుగా మనకు పెట్రోల్, డీజిల్ ఇంటికి సరఫరా చేయడం కష్టమైన పని. అందుకే కేవలం పెద్ద సంస్థలకు, బల్క్ కస్టమర్లకు కూడా డోర్ డెలివరీ ద్వారా డీజిల్‌, పెట్రోల్‌ను సరఫరా చేయబోతున్నారు. దీనివల్ల నిజంగా పెద్ద సంస్థలకు చాలా సమయం, డబ్బు ఆదా అవుతుంది. నిజంగా ఇదో బెస్ట్ ఇనీషియేటివ్.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here