ఇక ఊరూవాడా రిలయన్స్ పెట్రోల్ పంపులు

0
0


ఇక ఊరూవాడా రిలయన్స్ పెట్రోల్ పంపులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోల్ పంపులు దేశవ్యాప్తంగా మరింతగా పెరగబోతున్నాయి. అక్కడక్కడా కనిపించే బంకులను ఇక మూడు రెట్లకు పెంచబోతోంది రిలయన్స్. వీటికి తోడు విమానాలకు సరఫరా చేసే ఏవియేషన్ ఫ్యూయెల్స్ బిజినెస్‌లో కూడా తన సత్తాను చాటుకునేందుకు సంస్థ సిద్ధమైంది. రిటైల్ నెట్వర్క్‌తో పాటు ఏవియేషన్ ఫ్యూయల్ బిజినెస్ కోసం బ్రిటిష్ పెట్రోలియం(బిపి)తో కలిసి రిలయన్స్ కొత్త వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. రాబోయే ఐదేళ్లలో ఈ కొత్త సంస్థ దేశంలో కొత్తగా 5500 పెట్రోల్ పంపులను నెలకొల్పబోతోంది.

కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ సంస్థలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్‌కు 51 శాతం, బిపికి 49 శాతం వాటా ఉండనుంది. ఈ రెండు సంస్థలూ కలిసి దేశంలో 5000 కొత్త పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయబోతున్నాయి. ఇప్పుడున్న రిలయన్స్ బంకుల ఫ్యూయల్ సరఫరా నెట్వర్క్‌నే బలోపేతం చేసి వృద్ధిని బలోపేతం చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.

సేల్.. డబుల్

ఇప్పుడు రిలయన్స్‌కు స్వతంత్రంగా దేశంలో 1300 ఫ్యూయల్ ఔట్‌లెట్స్ ఉన్నాయి. బ్రిటిష్ పెట్రోలియం దేశంలో 3500 ఔట్ లెట్స్ ఏర్పాటు చేసేందుకు 2016 అక్టోబర్‌లోనే అనుమతి పొందింది. రిలయన్స్‌కు కూడా దేశవ్యాప్తంగా 5000 ఫ్యూయల్ రిటైల్ ఔట్ లెట్స్ తెరుచుకునేందుకు అనుమతి ఉంది. వీటన్నింటి విస్తరించి ఇప్పుడున్న 7-8 శాతం మార్కెట్ షేర్‌ను అతి కొద్దికాలంలోనే రెట్టింపు చేసుకోవాలని సంస్థ యోచిస్తోంది.

బ్రిటిష్‌తో బంధం ఎప్పటి నుంచో

బ్రిటిష్‌తో బంధం ఎప్పటి నుంచో

దేశంలో పెట్రోల్ వెలికితీత, ఉత్పత్తి వ్యాపారంలో రిలయన్స్‌తో ఏడెనిమిదేళ్ల నుంచి భాగస్వామిగా ఉంది బ్రిటిష్ పెట్రోలియం. ఫిబ్రవరి 2011లోనే లండన్‌కు చెందిన ఈ సంస్థ రిలయన్స్‌ దగ్గరున్న 21 ఆయిల్ అండ్ గ్యాస్ కాంట్రాక్టుల్లో 30 శాతం వాటాను 7.2 బిలియన్ డాలర్లకు కైవసం చేసుకుంది. ఈ ఇరు సంస్థలూ ఇండియాగ్యాస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భాగస్వాములు కూడా. ఈ సంస్థ గ్యాస్‌ను సోర్సింగ్ చేసుకుని దేశంలో వివిధ ప్రాంతాలకు మార్కెటింగ్ చేస్తుంది.

తాజాగా కుదిరిన ఒప్పందం నేపధ్యంలో రిలయన్స్ ఏవియేషన్ ఫ్యూయెల్ పై కూడా దృష్టిపెట్టింది. ప్రస్తుతం 30 విమానాశ్రయాల్లో ఈ సంస్థ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను సరఫరా చేస్తోంది. పెరుగుతున్న విమాన పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో కూడా అనూహ్యమైన వృద్ధిని ఆశిస్తోంది రిలయన్స్ – బిపి వెంచర్.

అందరి కన్నూ ఇండియాపైనే

అందరి కన్నూ ఇండియాపైనే

ఎలక్ట్రిక్ వాహనాల గురించి మనం మాట్లాడుకుంటున్నా ఈ రెండు సంస్థలు మాత్రం ఫ్యూయెల్, గ్యాస్‌కు రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ ఖచ్చితంగా ఉంటుందనే అంచనాతో ఉన్నాయి. ఫ్యూయల్ డిమాండ్ ఎక్కువగా ఉండబోతున్న దేశాల్లో ఇండియా కూడా ఉంటుందని, అందుకే ఇక్కడ తమ పెట్టుబడులు వస్తున్నాయని బ్రిటిష్ పెట్రోలియం చెబ్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ చమురు సంస్థల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో పాగా వేసి వృద్ధిని సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది బ్రిటిష్ పెట్రోలియం. అందుకే దేశంలో అతిపెద్ద సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో తమ బంధాన్ని మరింత ధృఢం చేసుకుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here