ఇతర పథకాల్లో లేని సూపర్ బెనిపిట్: సుకన్య సమృద్ధితో 5 లాభాలు

0
0


ఇతర పథకాల్లో లేని సూపర్ బెనిపిట్: సుకన్య సమృద్ధితో 5 లాభాలు

భవిష్యత్తును ధీమాగా ఉంచేందుకు సామాన్యులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకు వచ్చింది. అందులో సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒకటి. ఇతర పొదుపు పథకాలతో పోల్చి చూసినప్పుడు SSY అందించే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.4 శాతంగా ఉంది. SSY స్కీంను ఇండియా పోస్ట్ ఆఫర్ చేస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న తొమ్మిది స్మాల్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పథకాల్లో ఇది ఒకటి.

SSY ఖాతాతో ప్రయోజనం…

SSYతో పాటు 15 ఇయర్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (PPF), పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం అకౌంట్ (MIS), 5 ఇయర్ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (RD), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ (NSC), పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, కిసాన్ వికాస్ పత్ర (KVP), పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ (TD) ఉన్నాయి.

ఇక, SSYఖాతా విషయానికి వస్తే ఆడపిల్ల పేరు మీద 10 సంవత్సరాల లోపు దీనిని తెరువచ్చు. ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ.1000 గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయవచ్చు. భారత ప్రభుత్వ వడ్డీ రేటును త్రైమాసికం పరంగా సవరిస్తుంది. ఈ మొత్తం వడ్డీ సంవత్సరానికి జమ అవుతుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారులకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. SSY పథకం నుంచి ప్రయోజనం పొందేందుకు 5 మార్గాలు ఉన్నాయి.. అవేమిటో తెలుసుకుందాం…

వడ్డీ రేటు జమ వివరాలు...

వడ్డీ రేటు జమ వివరాలు…

సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లోని ఫండ్ పైన ప్రస్తుతం (01-07-2019 నుంచి) 8.4 శాతం వడ్డీ వస్తోంది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అన్నింటిలో కెల్లా ఎక్కువ వడ్డీ లభిస్తున్న రెండో పథకం ఇది. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయడంవల్ల ఎక్కువ రాబడి పొందవచ్చు. ప్రభుత్వం ప్రతి ఏడాది వడ్డీ రేటును ప్రకటిస్తుంది. వడ్డీ రేటు ప్రతి నెల 5వ తేదీ నుంచి చివరి తేదీ మధ్య యాడ్ అవుతుంది.

మెచ్యూరిటీ పీరియడ్ 21 ఏళ్లు

మెచ్యూరిటీ పీరియడ్ 21 ఏళ్లు

ఈ పథకం మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి దీనిని లెక్కలోకి తీసుకుంటారు. డబ్బులు ముందుగా తీసుకునే వెసులుబాటు ఉంది. అమ్మాయి ఉన్నత చదువుల కోసం డబ్బును తీసుకోవచ్చు. ఇది అమ్మాయి ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన పథకం. వివాహం కోసం డబ్బులు ఉపసంహరించుకుంటే అమ్మాయి వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 14 ఏళ్ల పాటు డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ పీరియడ్ మాత్రం 21 ఏళ్లు.

ఇతర పథకాలకు లేని అదపు బెనిఫిట్

ఇతర పథకాలకు లేని అదపు బెనిఫిట్

మెచ్యూరిటీ పీరియడ్ అనంతరం డబ్బును అకౌంట్ హోల్డర్‌కు ఇస్తారు. ఇక్కడ మెచ్యూరిటీ తర్వాత కూడా వడ్డీ రేటు లభిస్తుంది. అంటే అకౌంట్ క్లోజ్ చేయకుండా అలాగే కొనసాగిస్తే అందులోని డబ్బుకు వడ్డీ వస్తుంది. ఇతర పథకాలకు ఇలాంటి బెనిఫిట్స్ లేవు.

ఆదాయపు పన్ను మినహాయింపు

ఆదాయపు పన్ను మినహాయింపు

మోస్ట్ ట్యాక్స్ ఎఫెన్సివ్ పథకాల్లో ఒకటిగా SSYని పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉంటుంది. వడ్డీ, ఉపసంహరణ సమయంలో ఈ పథకం పన్ను మినహాయింపును అందిస్తుంది. కాబట్టి ఈ పథకం EEE అంటే వడ్డీ రేటు ఆదాయంపై, కాంట్రిబ్యూషన్ పైన, ఉపసంహరణ సమయంలోను ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

SSY చాలా సులభం..

SSY చాలా సులభం..

SSY అకౌంట్ నిర్వహణ చాలా ఈజీ. కేవలం రూ.1,000తో అకౌంట్ తెరువొచ్చు. తక్కువ మొత్తంలో కూడా ప్రతి నెలా డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్లోజ్ కాకుండా ఉండాలంటే సంవత్సరానికి కనీసం రూ.1000 డిపాజిట్ చేయవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు కూతుళ్ల పేరుపై అకౌంట్ తెరువొచ్చు. ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు మించకూడదు. ఆడపిల్లకు 10 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఆమె తన ఖాతాను స్వయంగా నిర్వహించుకోవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here