ఇన్వెస్ట్ చేయాలనకుంటున్నారా? ఈ పుస్తకాలు చదవండి!

0
0


ఇన్వెస్ట్ చేయాలనకుంటున్నారా? ఈ పుస్తకాలు చదవండి!

ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై సూచనలు చేసేందుకు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా మనకు వివరాలు లభిస్తున్నాయి. ఇన్వెస్టర్స్ తమ స్టాక్ ఎడ్యుకేషన్‌ను విస్తరింప చేసుకునేందుకు ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. ఈ జాబితాలో అందరూ చదువవలసిన 20 గొప్ప వాల్ స్ట్రీట్ పుస్తకాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం…

ఎ రాండమ్ వాక్ డౌన్ వాల్ స్ట్రీట్

A Random Walk Down Wall Street పుస్తకాన్ని బర్టాన్ మాల్కీల్ రచించారు. ప్రస్తుతం ఈ పుస్తకం పదవ ఎడిషన్‌లో ఉంది. స్టార్టింగ్ పోర్ట్‌పోలియోలో ఉన్నవారు మొదటిసారి చదవడం గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఇండెక్సింగ్, డైవర్సిఫికేషన్, ట్రెండ్స్, బబుల్స్ వంటివి ఎన్నో తెలుసుకోవచ్చు.

ది లిటిల్ బుక్ ఆఫ్ కామన్‌సెన్స్ ఇన్వెస్టింగ్

ది లిటిల్ బుక్ ఆఫ్ కామన్‌సెన్స్ ఇన్వెస్టింగ్

The Little Book of Common Sense Investing పుస్తకాన్ని జాన్ జీ బోగ్లే రాశారు. ఇతను ది వాగార్డ్ గ్రూప్ వ్యవస్థాపకులు. పరిశ్రమలో అతి తక్కువ ఖర్చుతో నిధులను అందించడంలో పేరు గాంచారు. వాగార్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ హౌస్. దీని నిర్వహణలో 3 ట్రిలియన్ డాలర్ల అసెట్స్ ఉన్నాయి. సులభం, ఖర్చు తక్కువతో పాటు లాంగ్ రన్ మార్కెట్ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేయమని వీరు చెబుతారు. జాక్ ఇతర పుస్తకాలు కామన్ సెన్స్ ఆన్ మ్యుచువల్ ఫండ్స్, స్టాక్స్ ఫర్ ది లాంగ్ రన్.

హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్స్

హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్స్

How to Make Money in Stocks పుస్తకాన్ని విలియమ్ జే ఓనీల్ రచించారు. నాలుగో పుస్తకం ది మోస్ట్ ఇంపార్టెంట్ థింక్స్ ఇల్యుమినేటెడ్‌ను హోవార్డ్ మార్క్స్ రచించారు. రెమినిసెన్స్ ఆఫ్ ఏ స్టాక్ ఆపరేటర్ అనే పుస్తకాన్ని ఎడ్విన్ లీఫెర్ రచించారు. ఇది నిజమైన పేజ్ టర్నర్. బఫెట్:ది మేకింగ్ ఆప్ అన్ అమెరికన్ కేపిటలిస్ట్ అనే పుస్తకాన్ని రోజర్ లోవెన్‌స్టీన్ రచించారు.

Market Wizards

Market Wizards

మార్కెట్ విజార్డ్స్ అనే పుస్తకాన్ని జాక్ ష్వాగర్ రచించారు. 1970/80లలోని విజయవంతమైన ట్రేడర్స్ ఇంటర్వ్యూల కలయిక ఈ పూస్తకం. ఆయా ట్రేడర్స్ అనుభాలు, స్పూర్థిదాయకమైన వారి పాఠాల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ట్రేడ్ యువర్ వే టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే బుక్‌ను వాన్ థార్ప్ రచించారు.

The Intelligent Investor

The Intelligent Investor

ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్.. ఇనే బుక్‌ను బెంజామిన్ గ్రహమ్ రాశారు. పెట్టుబడి విలువ, మార్కెట్‌లో ఎలా విజయం సాధించాలని వివరించే ఈ పుస్తకం 1 మిలియన్ కాపీల వరకు అమ్ముడుపోయింది. దాదాపు ప్రతి ఇన్వెస్టర్ బుక్ షెల్ఫ్‌లో ఈ పుస్తకం స్థానం సంపాదించుకుంది.

మరో పది పుస్తకాలు..

మరో పది పుస్తకాలు..

పై పది పుస్తకాలే కాకుండా మరో పది పుస్తకాలు కూడా ఉన్నాయి. జోయెల్ గ్రీన్‌బ్లాట్ రాసిన The Little Book That Beats the Market, మైఖేల్ లూయీస్ రాసిన Liar’s Poker, జార్జ్ సోరోస్ రాసిన Alchemy of Finance, నాస్సీమ్ టాలెబ్ రాసిన Fooled by Randomness, స్టీవన్ నిసాన్ రాసిన Japanese Candlestick Charting Techniques, చార్లెస్ మాకే రాసిన Extraordinary Popular Delusions and the Madness of Crowds, ఫిలిప్ ఫిషర్ రాసిన Common Stocks and Uncommon Profits, రాబర్ట్ షెల్లర్ రాసిన Irrational Exuberance, రోగర్ లోవెన్సీటన్ రాసిన When Genius Failed: The Rise and Fall of Long-Term Capital Management, థామస్ బుల్కోవ్సీ రాసిన Encyclopedia of Chart Patterns పుస్తకాలు చదువచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here