ఇన్వెస్ట్ చేస్తున్నారా: నష్టాల్లో ఉన్న సంస్థలేవో ఇలా తెలుసుకోండి

0
0


ఇన్వెస్ట్ చేస్తున్నారా: నష్టాల్లో ఉన్న సంస్థలేవో ఇలా తెలుసుకోండి

ఇప్పుడు చాలామంది షేర్ మార్కెట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ లాభాలు ఆర్జించవచ్చునని భావిస్తున్నారు. అయితే మార్కెట్ పైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరో చెప్పారని.. పెట్టుబడి పెట్టడం కాకుండా మార్కెట్‌ను అన్ని విధాలా అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఇన్వెస్ట్ చేసేముందు లేదా చేసినప్పటికీ ఆయా కంపెనీల పరిస్థితిని పసిగట్టడటం ద్వారా దివాలా తీయకుండా జాగ్రత్త పడవచ్చునని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కంపెనీల పరిస్థితిని అవగతం చేసుకునేందుకు ICAEW ఆరు సూచనలు….

నగదు కొరతతో ఇబ్బంది

ఏదైనా కంపెనీ లేదా సంస్థ నగదు కొరతతో ఇబ్బంది పడుతుందంటే గతి తప్పుతున్నట్లే లెక్క. డబ్బే రాజు అనే ఓ పాత సామెత ఉంది. ప్రతి వ్యాపారి కూడా ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కానీ నిత్యం నగదు కొరతతో ఇబ్బందిపడుతుందంటే సమస్యల్లో ఉన్నట్లే లెక్క. ఓ కంపెనీ తన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా పెడుతుందంటే అనుమానించాల్సిందే. లేదా అప్పుడే ప్రారంభించిన సంస్థలు ఇష్టానుసారం ఖర్చు చేసినట్లుగా లెక్కలు చూపిస్తాయి.

అధిక వడ్డీ చెల్లింపులు

అధిక వడ్డీ చెల్లింపులు

ఏదైనా కంపెనీ అత్యధిక వడ్డీలు చెల్లించి అప్పులు తెచ్చుకుంటుందంటే ఇబ్బందులు ఉన్నట్లే లెక్క. ఇది పేలవమైన ఆరోగ్య పరిస్థితిని సూచిస్తుంది. రుణగ్రహీతలపై విశ్వాసం లేకే రుణదాతలు అధిక వడ్డీకి ఇస్తారు. రుణాలు ఇచ్చినందుకు గాను బలమైన వ్యక్తిగత హామీలు లేదా భద్రతను రుణగ్రహీతలు కోరుకున్నారంటే ఆ కంపెనీ నష్టాల వైపు పరుగెత్తుతున్నట్లుగా అనుమానించవచ్చు.

బిల్స్ డిఫాల్ట్

బిల్స్ డిఫాల్ట్

ఏదైనా కంపెనీ లేదా వ్యక్తి బిల్లులు ఎప్పుడో ఓసారి మరిచిపోవడం సహజం. కానీ వరుసగా ఇలా జరిగితే ఆందోళన పడాల్సిన అంశమే. కంపెనీకి నిధుల కొరత ఉండటం లేదా అప్పులు వెంటాడితే ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో తీసుకున్న రుణానికి సంబంధించి ఇవ్వాల్సిన తేదీని పదేపదే పొడిగించుకుంటూ పోవడం, రుణం చెల్లించకపోవడం వల్ల ముడి పదార్థాల నిలుపుదల వంటి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులకు నిదర్శనం.

లాభాలు తగ్గితే...

లాభాలు తగ్గితే…

కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే అప్పుడే లాభాలు రాకపోవచ్చు. ఎవరైనా అనుభవజ్ఞుడైన వ్యాపారిని అడిగితే… వ్యాపారంలో ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే లాభాలు ముఖ్యమని, సేల్స్ మాత్రమే ముఖ్యం కాదని చెబుతాడు. లాభాలు పడిపోతున్నాయంటే ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అవుతుందని, అలాగే ఆదాయం తక్కువగా ఉందని అర్థం.

అసంతృప్తి

అసంతృప్తి

ఇది చాలా చిన్నదైన కారణంగా కనిపించవచ్చు. ఓవర్స్ లేదా మేనేజర్లు ఎవరో పొరపాటును గుర్తిస్తారు. అయితే వాటిని బయటకు తెలియనీయకుండా హఠాత్తుగా ప్లాన్స్ మార్చేస్తారు. దాటవేసే ధోరణి అవలంభిస్తారు. పొదుపు మంత్రం పాటిస్తారు. సరికొత్త వ్యూహాలు అనుసరిస్తారు. చాలామంది సీనియర్లు లేదా ఉన్నతోద్యోగులు కంపెనీ నుంచి తక్కువ సమయంలో వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here