ఇన్‌ఛార్జి వీసీ హామీతో సమ్మె విరమణ

0
0


ఇన్‌ఛార్జి వీసీ హామీతో సమ్మె విరమణ

 

వర్సిటీ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు 

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): సమస్యల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన తెవివి పొరుగు సేవల ఉద్యోగులు ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌ హామీతో తాత్కాలికంగా విరమించారు. బుధవారం ఉదయం ఉద్యోగులు, కార్మికులు ధర్నా కొనసాగించారు. సమాన పనికి సమాన వేతనం, జీవో నంబరు 14 అమలు చేయాలని నినాదాలు చేశారు. నిజామాబాద్‌ పార్లమెంటరీ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్‌ వీరికి మద్దతు తెలిపారు. అనంతరం యూనియన్‌ నాయకులతో రిజిస్ట్రార్‌ బలరాములు చర్చలు జరిపారు. వేతనాల పెంపు అంశంపై పాలక మండలిలో చర్చించి, సమస్య పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ చరవాణిలో హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు యూనియన్‌ నాయకులు ఎల్‌బీ రవికుమార్‌, సురేశ్‌ తెలిపారు. అనంతరం ఇన్‌ఛార్జి వీసీతో చర్చించడానికి యూనియన్‌ ప్రతినిధులు రిజిస్ట్రార్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు.

https://betagallery.eenadu.net/htmlfiles/138656.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here