ఇన్‌సైడర్ ట్రేడింగ్: ఈ సమాచారం ఇస్తే రూ.1 కోటి వరకు రివార్డ్

0
1


ఇన్‌సైడర్ ట్రేడింగ్: ఈ సమాచారం ఇస్తే రూ.1 కోటి వరకు రివార్డ్

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో ఏదైనా ఇన్‌సైడర్ ట్రేడింగ్ సమాచారం మీకు తెలిసి ఉంటే బంపర్ గిఫ్ట్ కొట్టేసినట్లే! ఎందుకంటే ఇలాంటి సమాచారం ఇచ్చేవారికి సెబి రూ.1కోటి వరకు రివార్డు ఇచ్చే ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది. వాటాదార్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ నియంత్రణ కోసం సరికొత్త ఇన్ఫర్మేషన్ వ్యవస్థ రూపకల్పనకు సెబి ప్రయత్నాలు చేస్తోంది. క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ సరికొత్త ఇన్ఫర్మేషన్ మెకానిజం రూల్స్ సిద్ధం చేసింది.

హాట్‌లైన్ ద్వారా చేరవేయవచ్చు!

షేర్లను ప్రభావితం చేసే అప్రకటిత సమాచారం ఆధారంగా కొందరు మాత్రమే ట్రేడింగ్ చేయడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇలాంటి వాటిపై సమాచారాన్ని అందించినవారికి సెబి రూ.కోటి రూపాయల నజరానా ఇచ్చే ఆలోచన చేస్తోంది. వారు గోప్యంగా హాట్‌లైన్ ద్వారా సమాచారం చేరేవేసే ఏర్పాటు చేస్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ (PIT) కింద సెబీ కొత్త ఇన్ఫర్మాంట్ మెకానిజం రూల్స్ సిద్ధం చేసింది.

ఇలా సమాచారం ఇవ్వాలి..

ఇలా సమాచారం ఇవ్వాలి..

చిన్న తప్పులు పాల్పడిన వాళ్లు దర్యాఫ్తుకు సహకరిస్తే సెటిల్మెంట్ లేదా శిక్ష తగ్గింపు అవకాశాలను కూడా సెబి కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ రూల్స్‌కు ఈ నెలలో బోర్డు అనుమతి తీసుకోవచ్చు. ఈ రివార్డులను వ్యక్తులు, కార్పోరేట్లు పొందే వీలుంది. ఆడిటర్ల బాధ్యత తప్పులు, మోసాలు గుర్తించడమే. కాబట్టి వీరికి ఈ బెనిఫిట్స్ వర్తించకపోవచ్చు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ సమాచారం అందించేవారు వీఐడీఎఫ్ ద్వారా సమాచారం ఇవ్వాలి.

పది శాతం నుంచి రూ.1 కోటి వరకు..

పది శాతం నుంచి రూ.1 కోటి వరకు..

ఇన్‌సైడర్ ట్రేడింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పరిణామాలు పూర్తిగా తెలియజేయాలి. దానిని ఆఫీస్ ఆఫ్ ఇన్ఫార్మెంట్ ప్రొటక్షన్ (OIP) పరిశీలించి, ప్రాసెసింగ్ చేస్తుంది. రివార్డు ఎంత అనే అంశాన్ని కూడా OIP నిర్ణయిస్తుంది. ఈ వీఐడీఎఫ్ సెబికీ, సమాచారం చేరవేసిన వ్యక్తికి మధ్య వారధిలా ఉంటుంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పైన సమాచారం ఇస్తే రూ.కోటి వరకు రివార్డ్ ఇస్తారు. అక్రమ లాభాన్ని నిలువరించినందుకు, ఆ మొత్తంలో కనీసం 10 శాతాన్ని, గరిష్టంగా రూ.కోటి వరకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here