ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ అన్‌ఫాలో.. అనుష్క శర్మ ఏమందో తెలుసా?

0
6


ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్ ఓట‌మి అనంతరం భార‌త జ‌ట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మ‌ధ్య విబేధాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కోహ్లీ, రోహిత్‌ జట్టును గ్రూపులుగా విభజించి రాజకీయాలు చేస్తున్నారని కూడా వార్తలు షికార్లు చేశాయి. ఇదిలా ఉండగానే.. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ విండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని భావించాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

సారధ్య భాద్యతలు పోతాయనే:

సారధ్య భాద్యతలు పోతాయనే:

ఇదే సమయంలో వ‌న్డే, టీ20ల‌కు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను.. టెస్ట్‌ల‌కు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియ‌మించాల‌నే అభిప్రాయాలు వచ్చాయి. రోహిత్‌ శర్మకి కెప్టెన్సీని అప్పగించడం ఇష్టం లేని కోహ్లీ మనసు మార్చుకుని.. తనకు విశ్రాంతి అవసరం లేదని, విండీస్ పర్యటనకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. సారధ్య భాద్యతలు పోతాయనే అభద్రతా భావంతో కోహ్లీ విశ్రాంతి తీసుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు అన్నీ తప్పని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

అనుష్కను అన్‌ఫాలో:

అనుష్కను అన్‌ఫాలో:

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కోహ్లీ, రోహిత్‌ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయనే అనిపిస్తోంది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో సెమీస్‌ ఓటమి తర్వాత ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తలెత్తాయని సమాచారం. గత సంవత్సరమే విరాట్ కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన రోహిత్ శర్మ.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, కోహ్లీ భార్య అనుష్క శర్మను కూడా అన్‌ఫాలో అయ్యాడు.

 నిజం మాత్రమే కరచాలనం చేస్తుంది:

నిజం మాత్రమే కరచాలనం చేస్తుంది:

ఈ విషయంపై స్పందించిన అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశారు. ‘తప్పుడు వార్తల ప్రచారంలో నిజం మాత్రమే నిశబ్దంతో కరచాలనం చేస్తుంది’ అనే కొటేషన్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అయితే రోహిత్‌, కోహ్లీల మధ్య ఏం జరిగిందనే విషయంపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. బీసీసీఐ కూడా స్పందించలేదు. అయితే సోషల్‌మీడియాలో మాత్రం ఈ ఇద్దరి వార్తలు వైరల్ అయ్యాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here