ఇప్పటి వరకు ఆధారాలు దొరకలేదు: విజిల్ బ్లోయర్స్‌పై ఇన్ఫోసిస్, పుంజుకున్న షేర్లు

0
1


ఇప్పటి వరకు ఆధారాలు దొరకలేదు: విజిల్ బ్లోయర్స్‌పై ఇన్ఫోసిస్, పుంజుకున్న షేర్లు

బెంగళూరు: తమ కంపెనీకి చెందిన సీఈవో, సీఎఫ్ఓలపై వచ్చిన ఆరోపణల మీద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇన్ఫోసిస్ సోమవారం వెల్లడించింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, అవి లభిస్తే దర్యాఫ్తు ప్రక్రియను ముమ్మరం చేసేందుకు ఆడిట్ కమిటీ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)కి రాసిన లేఖలో పేర్కొంది. గుర్తు తెలియని ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదులపై ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఫిర్యాదుల విశ్వసనీయత, కచ్చితత్వం, వాస్తవికతను కంపెనీ తేల్చలేకపోతోందని పేర్కొంది.

అధికారులపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. దీనిపై యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా దర్యాఫ్తు చేస్తోందని తెలిపింది.

ఇన్ఫోసిస్ విజిల్ బ్లోయర్స్ ఇష్యూ

కాగా, కంపెనీ తాజా ప్రకటనతో ఇన్ఫీ షేర్లు పుంజుకున్నాయి. ఓ దశలో షేర్ ధర 6.5 శాతం మేర పెరిగింది. మధ్యాహ్నం క్లోజింగ్‌కు ముందు.. గం.2.94 నిమిషాలకు షేర్ 3.69 శాతం పెరిగి 715 వద్ద ట్రేడ్ అయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here