ఇమ్రాన్ ఊపిరి పీల్చుకో.. పాక్‌తో రక్షణ ఒప్పందానికి అమెరికా గ్రీన్ సిగ్నల్

0
1


పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. వైట్ హౌస్‌లో ట్రంప్‌తో భేటీ అయిన ఇమ్రాన్.. తమ దేశంలో 30 వేల నుంచి 40 వేల మంది వరకు శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని.. ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న ఎవరూ ఈ మాట చెప్పలేదు, కానీ నేను నిజం ఒప్పుకొంటున్నానని చెప్పాడు. ఉగ్రవాదంపై పోరాటంలో మీ సహకారం కావాలని ఇమ్రాన్ ట్రంప్‌ను అభ్యర్థించాడు. ఓ దేశాధినేతగా హంగు ఆర్భాటాలను పక్కనబెట్టిన ఇమ్రాన్ కేవలం 60 వేల డాలర్ల ఖర్చుతోనే అమెరికా పర్యటనను ముగించాడు.

ఇమ్రాన్ అమెరికా పర్యటన ముగించుకొని రాగానే.. ఎఫ్-16 ఫైటర్ జెట్ల ఆధునికీకరణ కోసం 125 మిలియన్ డాలర్ల విలువైన మిలటరీ సామాగ్రిని పాకిస్థాన్‌కు విక్రయించడానికి అగ్రరాజ్యం అంగీకరించింది. అమెరికా రక్షణ శాఖ ఈ ప్రతిపాదనకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కాంగ్రెస్ అనుమతి కోసం పంపారు. పాకిస్థాన్‌కు భద్రతా సాయాన్ని నిలిపేయాలని 2018 జనవరిలో ట్రంప్ నిర్ణయించారు. అప్పటి నుంచి అమెరికా నుంచి పాకిస్థాన్‌కు ఆర్థిక, సైనిక సాయం ఆగిపోయింది.

పాకిస్థాన్ నైజం ఏంటో అమెరికాకు బాగా తెలుసు కాబట్టి.. ఇక నుంచి పాక్‌లోని ఎఫ్‌-16 యుద్ధ విమానాలపై నిరంతర నిఘా పెట్టనుంది. బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌-16 ఫైటర్లను పాకిస్థాన్ ఉపయోగించింది. పాకిస్థాన్ నిబంధనలు అతిక్రమించిందనడానికి భారత్ ఇదివరకే అమెరికాకు ఆధారాలు సమర్పించింది. భారత్ ఫిర్యాదుతోపాటు తమ సాంకేతికతను కాపాడుకోవడం కోసం అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here