ఇలాంటి భారత బౌలింగ్‌ని ఎప్పుడూ చూడలేదు.. అస్సలు ఊహించలేదు!!

0
4


ముంబై: ప్రస్తుతం ఉన్న భారత బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ లాంటి సీనియర్లు.. నవదీప్ సైనీ, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్ లాంటి పేసర్లు అలవోకగా వికెట్లు తీస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తున్నారు. దీంతో భారత మాజీలతో సహా.. ఇతర దేశాల మాజీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ కూడా చేరిపోయారు.

IND vs SA: భారత్‌ శుభారంభం.. మరో రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

ఇలాంటి పేస్‌ అటాక్‌ని ఎప్పుడూ చూడలేదు:

ఇలాంటి పేస్‌ అటాక్‌ని ఎప్పుడూ చూడలేదు:

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్‌దేవ్‌ పలు విషయాలపై మాట్లాడారు. ‘గత నాలుగైదు సంవత్సరాలలో ఫాస్ట్ బౌలర్లు భారత క్రికెట్‌ను మరింత స్థాయికి తీసుకెళ్లారు. ఇలాంటి పేస్‌ అటాక్‌ని గతంలో ఎప్పుడూ చూడలేదు. భారత బౌలర్లు కనీసం ఇలా ఉంటారని కూడా ఊహించలేదు. ఫాస్ట్‌ బౌలర్లు పేస్‌ విభాగాన్ని మార్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంపై మరోకరు ఏమీ చెప్పనవసరం లేదు. భారత బౌలర్ల బౌలింగ్ అద్భుతం’ అని అన్నారు.

మీ ఇలా బౌలింగ్‌ చేయడం ఆనందం:

మీ ఇలా బౌలింగ్‌ చేయడం ఆనందం:

‘తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ షమీ బాగా బౌలింగ్ చేసాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి పది మందిలో షమీ లేకపోయినా ఇబ్బందేమీ లేదు. ప్రస్తుతం జట్టుకు ఎలాంటి సేవలందిస్తున్నాడన్నదే మనకు ముఖ్యం. షమీ ఇలా బౌలింగ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుత భారత బౌలర్లను చూస్తే గర్వంగా ఉంది. తుది జట్టులో పోటీ ఎక్కువగా మారింది. యువకులు కూడా వస్తున్నారు. ఇది టీమిండియాకు మేలుచేసే అంశం’ అని కపిల్‌దేవ్‌ పేర్కొన్నారు.

ధోనీ భవిష్యత్తు గురించి ఎలా చెప్పగలం:

ధోనీ భవిష్యత్తు గురించి ఎలా చెప్పగలం:

‘ఐపీఎల్‌ జరగడం మనకు చాలా మేలుచేస్తోంది. ఈ లీగ్‌ వల్ల ఎంతో మంది యువ క్రికెటర్లకు తమ నైపుణ్యం ప్రదర్శించే వేదిక దొరికింది. ఈ లీగ్‌తోనే ఎంతో మంది జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ తనదైన ముద్ర వేయడం ఆనందంగా ఉంది. ఎంఎస్ ధోనీ గొప్ప క్రికెటర్. అతని భవిష్యత్తు గురించి మనం ఎలా చెప్పగలం. అతనే ఒక నిర్ణయం తీసుకోవాలి’ అని కపిల్‌దేవ్‌ చెప్పుకొచ్చారు.

సిరీస్‌లో ఆధిపత్యం:

సిరీస్‌లో ఆధిపత్యం:

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్టార్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లేకపోయినా.. టీమిండియా మొహమ్మద్ షమీ, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌యదవ్‌, దీపక్‌ చాహర్‌లతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. పేసర్లకు తోడు స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. దీంతో భారత్ ఈ టెస్టు సిరీస్‌లో ఆధిపత్యం కొనసాగిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here