ఇలాగైతే! టీ20 వరల్డ్‌కప్ గెలవడం అంత సులభం కాదు: టీమిండియాకు సన్నీ హెచ్చరిక

0
2


హైదరాబాద్: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పురోగతి సాధించని పక్షంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ నెగ్గడం చాలా కష్టమవుతుందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ వేదికగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీమిండియా ఆటతీరుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండిస్‌తో జరిగిన టీ20 సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకున్నప్పటికీ… ఇటీవలే సొంతగడ్డపై సఫారీలతో ముగిసిన టీ20 సిరిస్‌ను కోహ్లీసేన 1-1తో సమం చేసింది. తాజాగా బంగ్లాతో జరుగుతున్న టీ20 సిరిస్‌లో తొలి టీ20లో ఓడిపోయింది.

హ్యాపీ బర్త్‌డే: స్టార్‌ స్పోర్ట్స్‌‌ సూపర్‌ ‘వి’ సిరిస్‌లో కోహ్లీ భలే ముద్దొస్తున్నాడు! (వీడియో)

ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో టీమిండియా

ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో టీమిండియా

ఈ నేపథ్యంలో మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో “ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా 5వ స్థానంలో ఉంది. రెండు లేదా మూడు ర్యాంకులకు ఎగబాకాలంటే టీమిండియా కొన్ని పెద్ద మ్యాచ్‌లను గెలవాలి. టీమిండియా దీనిని చేయలేకపోతే, టీ20 వరల్డ్‌కప్ నెగ్గడం వారికి అంత సులభం కాదు” అని అన్నాడు.

ఢిల్లీ ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు

ఢిల్లీ ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు

“ఢిల్లీ ఓటమి నుంచి మనం నేర్చుకోవాలి. దీనిని మరిచిపోకూడదు. జట్టు తొలుత బ్యాటింగ్ చేసిన దానితో పోలిస్తే చేధనలో చాలా ఎక్కువ డాట్ బంతులను ఆడటం మనం చూశాము. ఢిల్లీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 55 డాట్ బాల్స్ ఆడారు. ఇది చాలా ఎక్కువ” అని అన్నారు.

శిఖర్ ధావన్ ఫామ్‌ఫై

శిఖర్ ధావన్ ఫామ్‌ఫై

“రాబోయే రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సరిగ్గా ఆడకపోతే అతడి ఫామ్‌పై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని బంతులైతే ఎదుర్కొన్నాడో అన్ని పరుగులే చేస్తే జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అతను దీని గురించి ఆలోచించాలి. గ్యాప్ తర్వాత ఆటగాళ్లు తిరిగి వచ్చినప్పుడు తిరిగి లయను పొందడానికి చాలా సమయం పడుతుంది” అని గవాస్కర్ తెలిపాడు.

గురువారం రాజ్ కోట్ వేదికగా రెండో టీ20

గురువారం రాజ్ కోట్ వేదికగా రెండో టీ20

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియాతో ఇంతకముందు జరిగిన 8 టీ20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌కు టీ20ల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ విజయంతో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో రాజ్ కోట్ వేదికగా జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here