ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాపర్టీ షోకు వెళ్లాల్సిందే..

0
1


ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాపర్టీ షోకు వెళ్లాల్సిందే..

ఇంటి కోసం స్థలం తీసుకోవాలనుకున్నా, కొత్త ఇంటిని కొనుగోలు చేయాలన్నా తెలిసిన వారిని ముందుగా సంప్రదిస్తాం. వారికి తెలిసిన వారు ఉంటే వాళ్ళను కూడా సంప్రదిస్తుంటాము. ఎందుకంటే స్థలం, ఇంటి కొనుగోలు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి. రియాల్టీ రంగంలో విశ్వసనీయమైన కంపెనీలు ఉన్నట్టే మోసం చేసే రియల్టర్లు ఉంటారు. డబ్బులు పెట్టి ఇరుక్కుపోతే అంతే సంగతి. కొన్ని సందర్భాల్లో రియాల్టీ లావాదేవీల్లో వివాదాలు కూడా జరుగుతుంటాయి. కొంత మంది డెవలపర్లు ఇండిపెండెంట్ ఇళ్లను నిర్మించి విక్రయిస్తారు.

వీరిలో కొంతమంది నిర్దేశిత సమయంలో ఇళ్లను పూర్తి చేస్తారు. మరికొందరు కొనుగోలుదారులను ఇబ్బందికి గురిచేస్తారు. కొంత మంది రియల్టర్లు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పేరుతో దండిగా వసూలు చేస్తారు. రేరా కింద రియల్టర్లు తప్పని సరిగా తమ ప్రాజెక్టు ను నమోదు చేయించాల్సి ఉంటుంది. కానీ కొంత మంది దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీని వల్ల కొనుగోలు దారులకే ఇబ్బంది తలెత్తుంతోంది. ఇలాంటి పరిస్థితిలో విశ్వసనీయమైన రియాల్టీ సంస్థను ఎంచుకోవడం కొంత కష్టంతో కూడుకున్న వ్యవహారమే. అయితే ఈ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా ఉంది. అదేమిటంటే ప్రాపర్టీ షో.

ప్రాపర్టీ షో లకు వెళ్ళండి…

* నగరాల్లో అనేక రియాల్టీ కంపెనీలు ఉంటాయి. కాబట్టి మీ బడ్జెట్ కు తగిన స్థాయిలో ఇంటిని నిర్మించి ఇచ్చే కంపెనీని ఇచ్చుకోవడం కష్టం. రియాల్టీ కంపెనీకి ఎంచుకోవడం ఎంతో వ్యయ ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి రియాల్టీ కంపెనీలు అన్ని కలిసి నగరాల్లో నిర్వహించే ప్రాపర్టీ షోలకు వెళ్లడం మంచింది.

* ఈ షో లలో అన్ని కంపెనీలు వాటి గత ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలియజేస్తాయి. అంతే కాకుండా కొత్త ప్రాజెక్టుల వివరాలు తెలుస్తాయి. మీరు కోరుకున్న ఇంటిని ఏ కంపెనీ అందిస్తుందో తెలుస్తుంది కూడా. దాన్ని బట్టి మీరు మీ బడ్జెట్ ను సవరించుకోవచ్చు.

* ఈ ప్రదర్శనల్లో గృహ ఫైనాన్స్ కంపెనీలు కూడా పాల్గొంటాయి. కాబట్టి రుణం తీసుకోవాలనుకుంటే మీకు ఎంత వడ్డీ రేటు ఉంటుందో కూడా తెలుస్తుంది. దీని ఆధారంగా రుణానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవచ్చు.

18 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో

* పదో విడతగా తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఈ నెల 18వ తేదీ నుంచి మూడురోజులపాటు హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది.

* ఈ ప్రదర్శనలో 100 మంది డెవలపర్లు, బిల్డర్లు, ప్రమోటర్లు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్లు, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్లు, ఆర్ధిక సంస్థలు పాల్గొంటాయి. ఈ సందర్భంగా ఈ సంస్థలు తమ ఉత్పత్తులు, సేవల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇవీ ప్రదర్శనకు ఉంటాయి..

* రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రాపర్టీ షో లో భాగంగా విభిన్న కస్టమర్లకు తగిన విధంగా ఉండే తమ అపార్టుమెంట్లు, విల్లాలు, ప్లాట్లు ప్రదర్శించనున్నాయి.

* స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, ఎల్ ఐ సి హోసింగ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంకు అఫ్ బరోడా, హెచ్ డీ ఎఫ్ సి, ఐ సి ఐ సి ఐ బ్యాంక్, సుందరం బీ ఎం పీ పరిబాస్ హోమ్ ఫైనాన్స్, ఐ ఐ ఎఫ్ ఎల్ హోమ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు పాల్గొననున్నాయి..

* ఇలాంటి ప్రాపర్టీ షో లకు ప్రవేశం ఉచితమే. వేలాది మంది ఈ లాంటి షోలకు వెళ్లడం వల్ల ఎక్కువగా అవగాహనా పొందడమే కాకుండా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. వెళ్ళండి మరి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here