ఇళ్ల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి తెలుసా?

0
0


ఇళ్ల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి తెలుసా?

దేశంలోని పలు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్టుగా ఇటీవలి కాలంలో పలు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థల సర్వే నివేదికల ద్వారా వెల్లడయింది. అయితే జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్ల అమ్మకాలు పెరగాలి కానీ తగ్గడం ఏమిటి? అసలు ఇళ్ల అమ్మకాలను ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? ఎలాంటి ఇళ్లను కొనుగోళ్లు చేయడానికి జనం ఆసక్తి చూపుతున్నారన్న అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం…

నిర్మాణంలో ఉన్న ఇళ్ల పై అనాసక్తి

చాలా మంది నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇలాంటి ఇళ్లను కొనుగోలు చేస్తే తమకు నచ్చిన విధంగా ఇంటీరియర్స్ లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ఇళ్లకు ప్రాదాన్యం ఇస్తుంటారు. కానీ ఇలాంటి ఇళ్లను కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి తగ్గినట్టు చెబుతున్నారు.

ఆర్ధిక వ్యవస్థపై ఆందోళన

ఆర్ధిక వ్యవస్థపై ఆందోళన

దేశ ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. వృద్ధి రేటు అంచనాలను పలు రేటింగ్ సంస్థలు తగ్గించి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్ధిక పరిస్థితి రానున్న కాలంలో ఎలా ఉంటుందోనని ఇళ్ల కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇళ్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.

ప్రోత్సాహాలను పట్టించుకోవడం లేదు

ప్రోత్సాహాలను పట్టించుకోవడం లేదు

రియల్ ఎస్టేట్ రంగానికి ఉద్దీపన కలిగించే విధంగా ప్రభుత్వం ఇటీవలి కాలంలో కొన్ని ప్రయోజనాలను, ప్రోత్సాహాలను ప్రకటించింది. అయితే ఇవి ఇళ్ల అమ్మకాలను పెంచడంలో పెద్దగా ప్రభావం చూపలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

9 నగరాల్లో 9 శాతం తగ్గిన అమ్మకాలు

9 నగరాల్లో 9 శాతం తగ్గిన అమ్మకాలు

* ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ ఇటీవలే తన నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ (మూడో త్రైమాసికం) వరకు దేశంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం మేర తగ్గాయి. రెండో త్రైమాసికం లో ఈ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 58,060 యూనిట్లుగా ఉంటే మూడో త్రైమాసికంలో 52,885 యూనిట్లకు తగ్గిపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే అమ్మకాల్లో 10 శాతం క్షీణత నమోదయింది.

* ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ ప్రకారం నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అమ్మకాలు వరుసగా 13 శాతం, 9 శాతం మేర తగ్గాయి. గత ఏడాది జులై – సెప్టెంబర్ తో పోల్చితే అమ్మకాలు 22 శాతం తగ్గాయి.

* ప్రాప్ టైగర్ నివేదిక ప్రకారం జులై- సెప్టెంబర్ లో ఇళ్ల అమ్మకాలు 25 శాతం తగ్గాయి.

* ప్రాప్ ఈక్విటీ ప్రకారం ఈ ఏడాది మూడో త్రైమాసికంలో హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు 16 శాతం తగ్గి 4,257 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇళ్ల అమ్మకాలు 5,067 యూనిట్లుగా ఉన్నాయి.

అంచనాలకు భిన్నంగా..

అంచనాలకు భిన్నంగా..

* ఇళ్ల అమ్మకాలకు సంభందించి చేస్తున్న అంచనాలు భిన్నంగా ఉంటున్నాయి. వస్తు సేవల పన్ను తగ్గించడం తో పటు పన్ను తగ్గింపు వంటి ప్రకటనలు చేసినప్పటికీ ఇళ్లకు డిమాండ్ ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఇళ్లను కొనుగోలు చేసే విషయంలో జనం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. రుణాలపై వడ్డీ రేట్లు దిగి వస్తున్నప్పటికీ అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదు.

అమ్మకాలు ఎందుకు పెరగడం లేదంటే...

అమ్మకాలు ఎందుకు పెరగడం లేదంటే…

ఇళ్లను కొనుగోలు చేసే విషయంలో ప్రజలు ఎందుకువెనుకా ముందు ఆడుతున్నారనేదానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. డెవలపర్లు తమ వద్ద మిగిలిపోయిన ఇళ్లను ఎలాగైనా విక్రయించాలని అనుకుంటున్నారు. అమ్ముడు పోకపోవడం వల్ల పాత బడిపోతున్నాయి. అలాంటి వాటిని కొనుగోలు చేయడానికి కొనుగోలు దారులు వెనుకాడుతున్నారు. మరోవైపు నిర్మాణంలో వెనుకబడిన ఇళ్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. తగిన మౌలిక సదుపాయాలు లేకున్నా, రాకపోకలకు ఇబ్బందులు ఉన్నా, ప్రాజెక్ట్ సరైన ప్రదేశంలో లేకపోయినా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని నివేదికల ద్వారా తెలుస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here