ఇళ్ల మంజూరులో ఎవరి మాట వినొద్దు

0
2


ఇళ్ల మంజూరులో ఎవరి మాట వినొద్దు


ప్రత్యేక వాహనంలో బాన్సువాడలో పర్యటిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: రెండు పడక గదుల ఇళ్ల మంజూరు విషయంలో ఎవరి మాట వినొద్దని, చివరికి నేను మర్చిపోయి చెప్పినా పట్టించుకోవద్దని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆర్డీవో రాజేశ్వర్‌కు సూచించారు. అర్హులకే మంజూరు చేయాలని కోరారు. పట్టణంలోని దాల్‌మల్‌గుట్ట, బీడీ వర్కర్స్‌ కాలనీ, మిస్రీ గల్లీ, ఇస్లాంపూర, గూడెంగల్లీ, పాత బాన్సువాడ, దాసరిగల్లీ, సంగమేశ్వర కాలనీలో ఆదివారం ప్రత్యేక వాహనంలో విస్తృతంగా పర్యటించారు. నూతనంగా నిర్మించనున్న 300 ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాడ్కోల్‌లో 500 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 500 మంజూరయ్యాయని చెప్పారు. పట్టణంలో సొంత స్థలాలు ఉన్నవారికి ఇప్పటికే 500 ఇళ్లను ఇచ్చామని, అవసరం మేరకు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. వడు మండలాల (బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌) అభివృద్ధి పనుల నిమిత్తం 5.87 కోట్లు, పట్టణంలోని బ్లడ్‌ బ్యాంకుకు ఆరు పోస్టులు మంజూరైనట్లు తెలిపారు. అనతరం కొనా బాన్సువాడ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అంతకుముందు వ్యాయామశాలలో రూ.60 లక్షలతో చేపట్టనున్న వ్యాపార సవదాయ గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట తెరాస నియోజకవర్గ నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, రైసస జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీపీ నీరజారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ, పుర కమిషనర్‌ కుమారస్వామి, తహసీల్దార్‌ సుదర్శన్‌, నందిని, భాస్కర్‌, వెంకట్రాంరెడ్డి, మోహన్‌నాయక్‌, పాత బాలకృష్ణ, లింగమేశ్వర్‌, ఏజాజ్‌, సురేష్‌, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here