ఈనెల 4న 11 ఉపకేంద్రాల పరిధిలో విద్యుత్తు సరఫరా ఉండదు

0
0


ఈనెల 4న 11 ఉపకేంద్రాల పరిధిలో విద్యుత్తు సరఫరా ఉండదు

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఈనెల 4న(సోమవారం) జిల్లాలోని 11 విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో మరమ్మతులు, కొత్త తీగలు వేసేందుకు విద్యుత్తు సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్తు శాఖ ఎస్‌ఈ సుదర్శన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉందని చెప్పారు. విద్యుత్తు సరఫరా ఉండని ఉపకేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి…నందిపేట్‌, వన్నెల్‌-కే, కుద్వాన్‌పూర్‌, మారంపల్లి, నూత్‌పల్లి, డొంకేశ్వర్‌, సీహెచ్‌ కొండూర్‌, చిక్లి, నిజామ్‌పూర్‌, జన్నెపల్లి, గుంజిలి ఉన్నట్లు తెలిపారు. వినియోగదారులు విద్యుత్తు శాఖ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కేంద్రాల పరిధిలో అనేక గ్రామాల్లో సరఫరా ఉండని కారణంగా వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ముందుగానే సమాచారం ఇస్తున్నట్లు చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here