ఈ ఆటో స్కీంకు దరఖాస్తు చేసుకోవాలి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంబిసి కులాలకు ప్రవేశపెట్టిన ఈ ఆటో స్కీమ్‌ను వినియోగించేందుకు ఎంబిసి, అత్యంత వెనుకబడిన బీసీ కులాలు సంచారజాతి కులాలకు చెందిన యువకులు, నిరుద్యోగులు స్కీమ్‌ వినియోగించుకొని స్వయం ఉపాధిని పొందాలని ఎంబీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మఠం విజయ్‌, కార్యదర్శి రాజలింగం, ఉపాధ్యక్షుడు పూసల రమేష్‌, సహాయ కార్యదర్శి వాల్మీకి బోయ శ్యాం కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎంబిసి కులాల ప్రజలు గత సంవత్సరం ప్రభుత్వం కేటాయించిన నిధులు వినియోగించుకోకపోవడం వల్ల తిరిగి ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాలోకి మళ్లీంచుకుందని దాన్ని తిరిగి తెప్పించుకునేందుకు ఎంబిసి కులాలు అభివద్ధి కోసం కామారెడ్డి జిల్లా ఎంబీసీ కులాల సంఘం పాటు పడుతుందని ఇందుకోసం ప్రభుత్వానికి నివేదించిన నివేదిక ఆధారంగా ఈ ఆటోల స్కీమును ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ స్కీం యొక్క ఆన్‌ లైన్‌ వెబ్‌ సైటు ప్రభుత్వం వన్‌ ఓపెన్‌ చేసిందని తెలిపారు. ఆటోలు కావలసిన యువకులు ఆధార్‌ కార్డు రేషన్‌ కార్డు జిరాక్స్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెండు ఫోటోలు తీసుకెళ్లి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు గలవారికి స్కీం వర్తిస్తుందని చెప్పారు. దీన్ని వినియోగించుకునే ఎంబిసి కులాలు అభివద్ధి సంక్షేమ పథకాల కోసం ఎంబీసీ ప్రజలంతా ఐకమత్యంగా ఉంటూ పోరాటాలకు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం నాయకులు రాములు, వీరయ్య, నాగరాజు, జనార్ధన్‌ తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here