ఈ ఉద్యోగులకు ఎస్బీఐ శాలరీ అకౌంట్, ప్రయోజనాలు తెలుసుకోండి

0
3


ఈ ఉద్యోగులకు ఎస్బీఐ శాలరీ అకౌంట్, ప్రయోజనాలు తెలుసుకోండి

శాలరీ అకౌంట్ తెరిచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. ఎస్బీఐ శాలరీ అకౌంట్ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులకు వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆకర్షణీయ సెక్యూరిటీస్, లైఫ్ లాంగ్ పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ఎక్కువమంది భారతీయులు ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటారు. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆకర్షణీయ రుణాలు, ప్రమాద బీమా, ఏటీఎం సేవలు, జీరో బ్యాలెన్స్ ఆప్షన్.. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

వివిధ రకాల శాలరీ అకౌంట్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ శాలరీ అకౌంట్‌ను వివిధ రకాల కేటగిరీలుగా విభజించారు. సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినమ్ కేటగిరీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ, ఆర్బీఐ, నాబార్డ్, వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల ఉద్యోగాలు ఆయా కేటగిరీల కింద శాలరీ అకౌంట్ పొందవచ్చు.

స్వతంత్ర ప్రతిపత్తి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు...

స్వతంత్ర ప్రతిపత్తి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు…

– ప్యూన్, సబ్ స్టాఫ్ వంటి బిలో క్లాస్ ఆఫీసర్ ఉద్యోగులకు సిల్వర్ శాలరీ అకౌంట్ ఆఫర్ చేస్తారు.

– క్లాస్ వన్ ఆఫీసర్లకు గోల్డ్ శాలరీ అకౌంట్ ఆఫర్ చేస్తారు.

– అండర్ సెక్రటరీ, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీలకు డైమండ్ శాలరీ అకౌంట్ ఆఫర్ చేస్తారు. డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ వంటి వారికి ప్లాటినమ్ శాలరీ అకౌంట్ ఆఫర్ చేస్తారు.

నాబార్డు, ఆర్బీఐ, డిఫెన్స్ తదితరులకు..

నాబార్డు, ఆర్బీఐ, డిఫెన్స్ తదితరులకు..

– రూ.5001 నుంచి రూ.20,000 వరకు వేతనం ఉంటే సిల్వర్ శాలరీ అకౌంట్.

– రూ.20,001 నుంచి రూ.50,000 వరకు వేతనం ఉంటే గోల్డ్ శాలరీ అకౌంట్.

– రూ.50,001 నుంచి రూ.1,00,000 వరకు వేతనం ఉంటే డైమండ్ శాలరీ అకౌంట్.

– రూ.1,00,000 అంతకంటే ఎక్కువ వేతనం ఉంటే ప్లాటినమ్ శాలరీ అకౌంట్.

ఎస్బీఐ శాలరీ అకౌంట్ బెనిఫిట్స్

ఎస్బీఐ శాలరీ అకౌంట్ బెనిఫిట్స్

– జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఏ బ్యాంకు ఏటీఎం అయినా ఉచిత అన్‌లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్.

– ఎస్బీఐ క్రెడిట్ కార్డులు

– రూ.20 లక్షల వరకు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ (డెత్)

– రూ.30 లక్షల వరకు కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ (డెత్)

– ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, కారు లోన్, ఎడ్యుకేషన్ లోన్.

– లోన్స్ తీసుకుంటే 50 శాతం ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు

– లాకర్ ఛార్జీల పైన 25 శాతం తగ్గింపు

– అకౌంట్ తీసుకునే సమయంలోనే డీమ్యాట్ అకౌంట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ అకౌంట్.

– డ్రాఫ్ట్స్, మల్టీ సిటీ చెక్కులు, ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు ఉచితం. ఉచిత ఆన్‌లైన్ NEFT/RTGS

– 2 నెలల నికర లాభానికి సమాన ఓవర్ డ్రాఫ్ట్.. ఇలా ఎన్నో ప్రయోనాలు ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here