ఈ కారు ఆగిపోగానే నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ ప్రసారం!

0
5


ఈ కారు ఆగిపోగానే నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ ప్రసారం!

న్యూయార్క్: మరికొద్ది రోజుల్లో టెస్లా కార్లలో అద్భుతమైన అనుభూతిని పొందే అవకాశముంది. ఈ మేరకు టెస్లా వెహికిల్స్ ఆగిన సమయంలో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ ప్రసారం అవుతాయని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. ఇది ఆగస్ట్ నుంచి అందుబాటులోకి రానుందని, కొద్ది నెలలు మినహా మరెంతో కాలం లేదని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. కారు సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లోకి వెళ్లాక టెస్లా ఓనర్స్ లైవ్ స్ట్రీమ్‍ చేసుకోవచ్చునని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

కారు ఆగినప్పుడు నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్

కారు ఆగిపోయినప్పుడు యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అయ్యే టెస్లా త్వరలో మీ ముందుకు రానుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఇది గొప్ప అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నాడు. సౌకర్యవంతమైన సీట్లు, సౌండ్ ఆడియో కారణంగా సినిమాటిక్ అనుభూతి ఉంటుందన్నారు. అయితే, టెస్లా కార్లు భారత్‌లోకి మరి కొద్ది రోజుల్లో అడుగు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కార్లు ఇండియాకు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

టెస్లా వర్షన్ 10

టెస్లా వర్షన్ 10

టెస్లా వర్షన్ 10 (V10)లో గేమ్స్, ఇన్పోటైన్‌మెంట్ ఫీచర్స్, మెరుగైన హైవే ఆటో పైలట్, బెట్టర్ ట్రాఫిక్ లైట్, స్టాప్ సైన్ రికగ్నైజేషన్‌తో పాటు స్మార్ట్ సమన్ ఉంటాయని ఎలాన్ మస్క్ వెల్లడించారు. స్పీకర్స్ ద్వారా టెక్స్ట్ సందేశాన్ని చదవవచ్చా అని అంటే ఎలాన్ మస్క్.. అవును అని చెప్పారు. టెస్లా వర్షన్ 10 (V10) ఆగస్ట్‌లో విడుదల కానుంది.

త్వరలో భారత్‌లోకి టెస్లా

త్వరలో భారత్‌లోకి టెస్లా

ఇదిలా ఉండగా, 2020 నాటికి టెస్లా కార్లు భారత్‌లో అడుగు పెట్టనున్నాయని ఎలాన్ మస్క్ ఇటీవల వెల్లడించారు. గత కొన్నేళ్లుగా టెస్లా భారత్‌లో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. తాజాగా, జీఎస్టీ కౌన్సెల్ సమావేసంలో ఎలక్ట్రానిక్ వాహనాలపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో టెస్లాకు మార్గం మరింత సుగమం అయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here