ఈ పండుగ సీజన్‌లో రూ.24,000 కోట్ల సేల్స్, కారణాలు ఇవే

0
3


ఈ పండుగ సీజన్‌లో రూ.24,000 కోట్ల సేల్స్, కారణాలు ఇవే

న్యూఢిల్లీ: దసరా – దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైంది. సెల్ ఫోన్లు, హోమ్ అప్లియెన్సెస్, వెహికిల్స్, ఆభరణాలు.. ఇలా అన్నింటిపై ప్రముఖ ఈ కామర్స్ బిజినెస్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్టులు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇప్పటికే సేల్స్ ప్రారంభమయ్యాయి. పేటీఎం మాల్ కూడా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ సేల్స్ పెద్ద మొత్తంలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి.

రూ.25,000 కోట్ల వరకు సేల్స్

ఇటీవలి వరకు వెహికిల్ సేల్స్, ఎఫ్ఎంసీజీ భారీగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ముందుకు కదల్లేదు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అందరిలో మాంద్యం భయం పట్టుకుంది. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా నాలుగు పర్యాయాలు ఉద్దీపనలు ప్రకటించింది. దీంతో ఇప్పుడిప్పుడే పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు సేల్స్ లేవు. దానికి తోడు కేంద్రం ఇప్పుడు ఉద్దీపనలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఈ-కామర్స్ సేల్స్ భారీగా ఉంటాయని భావిస్తున్నారు. గత ఏడాది ఈ పండుగ సీజన్‌లో రూ.16,000 కోట్ల సేల్స్ ఉండగా, ఇప్పుడు రూ.24,000 కోట్ల సేల్స్ ఉంటాయని భావిస్తున్నారు.

కేంద్రం చర్యలు.. తగ్గుతున్న ధరలు

కేంద్రం చర్యలు.. తగ్గుతున్న ధరలు

ఆర్థిక మందగమనం నుంచి ఉపశమనం కలిగించేందుకు కంపెనీలకు కార్పోరేట్ పన్ను రూపంలో భారీ రాయితీని కేంద్రం ప్రకటించింది. దీంతో కూడా ఉత్పత్తుల ధరలు మరింత తగ్గుతాయి. జీఎస్టీ రేట్లలో మార్పులు, ధరల తగ్గింపు, కొత్త మోడల్స్ కోసం వినియోగదారుల ఎదురుచూపు నేపథ్యంలో ఆన్‌లైన్ సేల్స్ ఎక్కువగా ఉంటాయని అంచనా.

7.5 కోట్ల లావాదేవీలు

7.5 కోట్ల లావాదేవీలు

ఈ దసరా – దీపావళి పండుగ సీజన్‌లో 3.2 కోట్ల మంది ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లు జరుపుతారని, 7.5 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని రెడ్ సీర్ కన్సల్టెన్సీ, ఫోరెస్టర్ సంస్థలు అంచనా వేశాయి. 2018లో 4.5 కోట్లు ఉంటగా ఇప్పుడు 60 శాతం అధికమని అంచనా వేసింది. ఆన్ లైన్ పోర్టల్స్ వాటా 15 శాతంగా భావిస్తున్నారు.

కొత్త మోడల్స్.. పాత మోడల్స్ పై ధర తగ్గింపు

కొత్త మోడల్స్.. పాత మోడల్స్ పై ధర తగ్గింపు

దిగ్గజ కంపెనీలు ఉన్న తమ కొత్త మోడల్స్‌ను తీసుకు వస్తున్నాయి. అదే సమయంలో పాత మోడల్స్ ధరలు తగ్గిస్తున్నాయి. దీంతో కొత్త మోడల్స్ కోసం చూసేవారితో పాటు పాత మోడల్స్ ధర తగ్గడం వల్ల ఎక్కువ మంది వీటిని కొనేందుకు ఆస్కారం ఉంటుంది.

ఆఫర్లు, గిఫ్టులు

ఆఫర్లు, గిఫ్టులు

గత కొన్నాళ్లుగా టీవీల, మొబైల్స్, వెహికిల్స్.. ఇలా అన్ని సేల్స్ తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆఫర్లు, గిఫ్ట్‌లతో కంపెనీలు ఆకర్షిస్తున్నాయి. సేల్స్ బాగా ఉంటాయని చెప్పేందుకు ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు.

క్యాష్ బ్యాక్, రాయితీ

క్యాష్ బ్యాక్, రాయితీ

ఆన్ లైన్ పోర్టల్స్‌తో పాటు స్థానిక దుకాణాలలో వడ్డీ లేకుండానే సులభ వాయిదాల్లో కొనుగోలుకు అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా ఆన్ లైన్ పోర్టల్స్ సేల్స్ ద్వారా ఆయా బ్యాంకులు కొనుగోలుపై రాయితీలు, క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి.

ఆన్‌లైన్ పోర్టల్స్‌లలో భారీ తగ్గింపు

ఆన్‌లైన్ పోర్టల్స్‌లలో భారీ తగ్గింపు

ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్ సైట్స్ మొబైల్స్, టీవీలు, హోమ్ అప్లియెన్సెస్ తదితరాలపై 20 శాతం నుంచి 60, 70 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నాయి. అమెజాన్ ఫ్యాషన్ పైన 90 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కిచెన్ అప్లియెన్సెస్ వంటి వాటిపై 75 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here