ఈ పేమెంట్ బ్యాంక్ క్లోజ్, 26వ తేదీలోగా మీ అమౌంట్ ట్రాన్సుఫర్ చేసుకోండి

0
2


ఈ పేమెంట్ బ్యాంక్ క్లోజ్, 26వ తేదీలోగా మీ అమౌంట్ ట్రాన్సుఫర్ చేసుకోండి

ముంబై: ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంకును నిలిపివేసింది. ఈ మేరకు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ప్రకటించింది. ప్రముఖ టెలికం రంగ దిగ్గజం ఐడియా సెల్యూలర్, ఆదిత్య బిర్లా నువో వెంచర్ అయినా ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంకు తన ఆపరేషన్స్ మూసివేసింది. ఈ పేమెంట్ బ్యాంకు ప్రారంభమై కేవలం 18 నెలలు మాత్రమే అవుతోంది.

జూలై 26వ తేదీలోపు బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ చేసుకోండి

ఈ మేరకు జూలై 26వ తేదీలోపు ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంక్స్ కస్టమర్లు తమ బ్యాలెన్సును ట్రాన్సుఫర్ చేసుకోవాలని ఈ ప్రకటనలో తెలిపింది. సంస్థ నిర్వహణ భారంగా మారిందని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2015 ఆగస్టులో 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకు లైసెన్సులు ఇచ్చింది. 2018 ఫిబ్రవరిలో ఆదిత్యా బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంకును ప్రారంభించింది. కానీ ఏడాదిన్నరలోనే దీనిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఊహించని పరిణామాల వల్ల వ్యాపారం దెబ్బతిన్నది

ఊహించని పరిణామాల వల్ల వ్యాపారం దెబ్బతిన్నది

ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్ సేవలు నిలిపివేసేందుకు, వ్యాపారం మూసివేసేందుకు తమ అనుబంధ కంపెనీ డైరెక్టర్ల బోర్డు నియంత్రణ సంస్థ అనుమతి కోరామని తెలియజేస్తున్నామని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఊహించిన పరిణామాల వల్ల తమ వ్యాపారం భారంగా మారిందని పేర్కొంది.

డిపాజిట్స్ తిరిగి చెల్లించే ఏర్పాట్లు

డిపాజిట్స్ తిరిగి చెల్లించే ఏర్పాట్లు

జూలై 26, 2019 తర్వాత మీ ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంకు అకౌంట్‌లోకి క్రెడిట్ (డబ్బులు యాడ్ చేయడం) చేయలేరని ఈ ప్రకటనలో తెలిపింది. పేమెంట్ బ్యాంకులోని అన్ని డిపాజిట్స్ తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. జూన్ 26వ తేదీ లోపు బ్యాలెన్సును ట్రాన్సుఫర్ చేసుకోవాలని సూచించింది.

క్లోజింగ్‌కు ఇది కూడా ఓ కారణం

క్లోజింగ్‌కు ఇది కూడా ఓ కారణం

ఓ నివేదిక ప్రకారం డిసెంబర్ 2018 నాటికి ఈ పేమెంట్ బ్యాంకు రూ.5.62 కోట్లను సమీకరించింది. ఈ మార్కెట్‌ను ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు, పేటీఎం బ్యాంకులు అప్పటికే డామినేట్ చేస్తున్నాయి. మొత్తంగా ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంకు డిసెంబర్ 2018 నాటికి రూ.780 కోట్లు కలిగి ఉంది. కఠిన కేవైసీ నిబంధనలు, మార్కెట్లో గట్టి పోటీ వంటి కారణాలు కూడా ఈ క్లోజింగ్‌కు కారణంగా తెలుస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here