ఈ బ్యాంకుల కస్టమర్లకు గుడ్‌న్యూస్, వెంటనే వడ్డీరేట్లు తగ్గుతాయి

0
0


ఈ బ్యాంకుల కస్టమర్లకు గుడ్‌న్యూస్, వెంటనే వడ్డీరేట్లు తగ్గుతాయి

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు తగ్గించగానే వడ్డీ రేటు ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు బ్యాంకులు వెనుకాముందు ఆడేవి. ఆలస్యంగా లేదా ప్రయోజనాలు అందించకపోవడం జరిగేది. ఈ అంశంపై ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలుమార్లు బ్యాంకులకు సూచనలు చేశాయి. ఇటీవల బ్యాంకులు రెపో రేటు ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఆర్బీఐ రెపో రేటును 35 బేసిస్ పాయింట్స్ తగ్గించగానే ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు కూడా అందివ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెంటనే ప్రకటించింది. యూకో బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్.. పలు పీఎస్‌యూ బ్యాంకులు కూడా అదే దారిలో నడిచాయి.

రుణాల వడ్డీ తగ్గించిన అలహాబాద్, యూకో బ్యాంకు

ఇటీవల ఆర్బీఐ రెపో రేటు తగ్గించగానే ఎస్బీఐ కూడా 15 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ ఎంసీఎల్ఆర్ 15-20 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. యూకో బ్యాంకు అన్ని కాల పరిమితులపై 15 బేసిస్ పాయింట్స్ తగ్గించింది.

రెపో రేటు ఆధారంగా.. సిండికేట్ బ్యాంక్

రెపో రేటు ఆధారంగా.. సిండికేట్ బ్యాంక్

హోమ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్స్ ఇక నుంచి రెపో లింక్ట్ రేట్ ప్రాతిపదికన ఇస్తారని, ఈ మార్పుతో గృహ రుణాలు 8.30 శాతం ఉంటాయని సిండికేట్ బ్యాంకు కూడా ప్రకటించింది. రూ.25 లక్షలకు మించిన సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ కూడా రెపో రేటు ఆధారంగా ఉంటుందని తెలిపింది. రెపో రేటు ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తామని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది.

రెపో రేటు ప్రయోజనాలు వెంటనే...

రెపో రేటు ప్రయోజనాలు వెంటనే…

ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన మరుక్షణమే ఈ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం తమ రుణ వడ్డీ రేట్లను ఆర్బీఐ రెపో రేటుతో అనుసంధానించేందుకు అన్ని పీఎస్‌యూ బ్యాంకులు అంగీకరించాయి. రెపో రేటు తగ్గితే కస్టమర్లకు ఆ ప్రయోజనాలు చెల్లించడం వరకు ఓకే. కానీ బ్యాంకుల లాభదాయకత ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు.

ఆర్బీఐ తగ్గించిన దానిలో మూడోవంతు...

ఆర్బీఐ తగ్గించిన దానిలో మూడోవంతు…

ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఈ క్యాలెండర్ ఇయర్లో 110 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో హోమ్ లోన్స్, వెహికిల్ లోన్స్ చౌక అయ్యాయి. ఆర్బీఐ తగ్గించిన బేసిస్ పాయింట్లలో సగటున మూడొంతులు మాత్రమే బ్యాంకులు తగ్గిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (MCLR)ను తగ్గిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ప్రయోజనాలు సత్వరమే కస్టమర్లకు అందేలా రెపో రేటుతో బ్యాంకర్లు తమ రుణాల వడ్డీరేట్లను అనుసంధానం చేస్తున్నారు.

అనుసంధానం చేస్తాం..

అనుసంధానం చేస్తాం..

సెంట్రల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు త్వరలోనే తమ రుణ వడ్డీరేట్లను నేరుగా రెపోరేటుతో అనుసంధానిస్తామని తెలిపాయి. ఇది బ్యాంకుల లాభాదాయకతను కొంత తగ్గించే అవకాశముంది. అలహాబాద్ బ్యాంకు డిపాజిట్స్, రుణాల వడ్డీరేట్లను పూర్తిగా బెంచ్ మార్క్ రేట్లతో అనుసంధానించే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు సీఈవో మల్లికార్జునరావు తెలిపారు.

ఏ బ్యాంక్ ఎంత తగ్గించింది...

ఏ బ్యాంక్ ఎంత తగ్గించింది…

ఆర్బీఐ ఇటీవల రెపో రేటు తగ్గించిన అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 బేసిస్ పాయింట్స్ తగ్గించింది.

ఆంధ్రా బ్యాంకు అన్ని కాల వ్యవధి రుణాలపై 0.25 శాతం తగ్గించింది. ఈ రేట్లు ఆగస్ట్ 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాది కాలవ్యవధి రుణంపై వడ్డీ రేటు 8.45 శాతం.

కెనరా, సిండికేట్ బ్యాంకు...

కెనరా, సిండికేట్ బ్యాంకు…

కెనరా బ్యాంకు వడ్డీ రేటును 0.10 శాతం తగ్గించింది. ఆగస్ట్ 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఏడాది రుణాలపై వడ్డీ 8.50 శాతం అవుతుంది.

సిండికేట్ బ్యాంకు వడ్డీరేటు 0.25 శాతం తగ్గించింది. ఆగస్ట్ 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.35%.

BOB, అలహాబాద్ బ్యాంకు

BOB, అలహాబాద్ బ్యాంకు

బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేటుబం 0.25 శాతం తగ్గించింది. ఇది ఆగస్ట్ 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఏడాది కాలావధి రుణాలపై వడ్డీరేటు 8.35 శాతం.

అలహాబాద్ బ్యాంకు అన్ని కాలవ్యవధి రుణాలపై వడ్డీ రేట్లను 0.15 శాతం నుంచి 0.20 శాతం తగ్గించింది. ఇది ఆగస్ట్ 14వ తేదీ నుంచి అమలవుతుంది. ఏడాది కాలవ్యవధి రుణాలపై వడ్డీ రేటు 8.55 శాతం.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏడాది అంతకుమించిన కాలవ్యవధి రుణాలపై 0.15 శాతం తగ్గించింది. ఏడాదిలోపు రుణాలపై 0.10 శాతం వడ్డీరేటును తగ్గించింది. ఇది ఆగస్ట్ 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

యూనియన్ బ్యాంకు వడ్డీ రేటును ఇదివరకే ఆగస్ట్ 1వ తేదీ నుంచి 5-20 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఇప్పడు మరో 15 బేసిస్ పాయింట్స్ తగ్గించనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here