ఈ-స్కూటర్ కొంటే అందరికీ డిస్కౌంట్, ఒక్కరికి బంపరాఫర్

0
2


ఈ-స్కూటర్ కొంటే అందరికీ డిస్కౌంట్, ఒక్కరికి బంపరాఫర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించే అంశాలపై దృష్టి సారించింది. ఇప్పటికే EVలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈ ప్రయోజనాలను కంపెనీలు కస్టమర్లకు కూడా అందించేందుకు సిద్ధమయ్యారు. భారత్‌లో పండుగల సీజన్ వస్తోంది. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పర్వదినాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మానుఫ్యాక్చరర్ కంపెనీ ఒకినావా తమ కొత్త స్కూటర్స్ కస్టమర్ల కోసం ఆఫర్లు ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్లు ఆగస్ట్ 12వ తేదీన ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 31వ తేదీకి ముగియనున్నాయి. దేశవ్యాప్తంగా ఒకినావా డీలర్‌షిప్‌ల వద్ద ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఆఫర్లు ఏమిటి

– ఒకినావా స్కూటర్స్ ఆఫర్స్ ప్రకారం… ఓ లక్కీ కస్టమర్ బంపర్ గిఫ్ట్ గెలుస్తారు. వారికి ఫారన్ ట్రిప్ ఉచితం.

– 20 మంది లక్కీ విన్నర్లు ఎయిర్ కండిషనర్స్, ఎల్ఈడీ టెలివిజన్స్, మైక్రోవేవ్, మిక్చర్ గ్రైండర్ వంటి మెగా ప్రైజెస్ గెలుచుకుంటారు.

– ఏదైనా ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్.

విజేతల ప్రకటన

విజేతల ప్రకటన

ఆగస్ట్ 12వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి విజేతలను నవంబర్ నెలలో ప్రకటిస్తారు. అంటే ప్రతి కస్టమర్ రూ.1000 ప్రయోజనం పొందుతారు. అలాగే, 20 మంది లక్కీ కస్టమర్లకు ప్రత్యేక బహుమతులు, ఒక లక్కీ కస్టమర్‌కు ఫారన్ ట్రిప్ ఉచితం.

స్కూటర్ల విక్రయాలు పెరిగాయి...

స్కూటర్ల విక్రయాలు పెరిగాయి…

భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదేనని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగాన్ని పెంచే విధంగా ఉన్నాయని ఒకినావా ఆటోటెక్ ప్రయివేటు లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీతేందర్ శర్మ అన్నారు.

కస్టమర్లకు జీస్టీ బెనిఫిట్స్

కస్టమర్లకు జీస్టీ బెనిఫిట్స్

కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 7 శాతం తగ్గించిందని, ఈ ప్రయోజనాలను తాము కస్టమర్లకు అందిస్తున్నామని జీతేందర్ చెప్పారు. ఇప్పటికే ఇది స్కూటర్ల విక్రయాలకు ఉపయోగపడిందని, ఇప్పుడు మరింతమంది కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ఆఫర్లు ప్రకటించామన్నారు. ఈ-స్కూటర్లకు డిమాండ్ పెరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సరసమైన ధరలకు కస్టమర్లకు అందిస్తున్నామన్నారు.

పండుగ ఆఫర్లు

పండుగ ఆఫర్లు

స్వాతంత్ర దినోత్సవం, రక్షా బంధన్, దసరా, నవరాత్రి, దీపావళి వంటి పండుగల సందర్భంగా కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనుగోలును ప్రోత్సహించేందుకు కూడా ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ పండుగల ఆఫర్ల ద్వారా కస్టమర్లను పర్యావరణ అనుకూల మరియు ఆర్థిక ప్రయాణ పరిష్కారాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ ఆఫర్ల ద్వారా కస్టమర్లు ఈవీలవైపు మొగ్గు చూపుతారన్నారు.

ప్రతి కస్టమర్‌కు ప్రయోజనం

ప్రతి కస్టమర్‌కు ప్రయోజనం

ఒకినావా స్కూటర్ కొనుగోలుపై ప్రతి కస్టమర్ కూడా ప్రయోజనం పొందుతాడని జీతేందర్ శర్మ అన్నారు. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఇది ఉపయోగపడుతుందని, ఇది తమ డీలర్లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు ఈ పండుగ సీజన్ ఆఫర్ కస్టమర్లకు ప్రత్యేక కొనుగోలు అనుభూతి ఇస్తుందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here