ఉక్కపోతగా ఉందని.. విమానం డోరు తెరిచిన మహిళ

0
3


స్సులో బాగా ఉక్కపోస్తే కిటికీ డోర్ తెరిచి కాసేపు చల్ల గాలిని ఆస్వాదిస్తాం. అయితే, విమానాల్లో అలా సాధ్యం కాదు. అయితే, చైనాకు చెందిన ఓ మహిళ.. విమానంలో ఉక్కపోస్తోందని ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచి చిక్కుల్లో పడింది. లక్కీగా ఆ విమానం రన్‌వే మీదే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉండేది. ఆమె చేసిన పనికి విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది.

Read also: షాకింగ్.. విమానంలో ఆక్సిజన్ నిలిపేసి 238 ప్రయాణికుల హత్య?

హుబీ నగరంలోని టియాన్హె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న జియమెన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కిన మహిళ ఉక్కపోతగా ఉండటంతో తన పక్కనే ఉన్న ఎమర్జన్సీ డోర్ తెరిచింది. పక్కనే కూర్చొన్న ప్రయాణికులు అలా చేయకూడదని వారించినా ఆమె మాట వినలేదు. తనకు ఉక్కబోతగా ఉందని, తలుపు తీస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తుందని తెలిపింది. విమానం బయల్దేరేందుకు సిద్ధం కాగానే మూసేస్తానని తెలిపింది. దీంతో విమాన సిబ్బంది ఆమెను విమానం నుంచి కిందికి దించేసి పోలీసులకు అప్పగించారు. భవిష్యత్తులో ఆమె మళ్లీ విమానం ఎక్కకుండా నిషేదం విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

వీడియో:

Read also: విమానంపై పిడుగు.. 10వేల అడుగుల ఎత్తు నుంచి పడినా ఆమెకు ఏమీ కాలేదు!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here