ఉక్కపోస్తోందని.. నడి రోడ్డుపై దుస్తులు విప్పేసిన మహిళ

0
4


బాగా ఉక్కపోస్తే ఏం చేస్తాం? చల్లని ప్రాంతానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. అంతేగానీ.. నడి రోడ్డుపై దుస్తులు విప్పేసి తిరిగే సాహసం ఎవరైనా చేయగలరా? అయితే.. అమెరికాలోని టేనస్సీ రాజధాని నాష్విల్లెలో ప్రిన్సెస్ డెనిసే డే అనే 35 ఏళ్ల మహిళ పట్టపగలు.. అంత చూస్తుండగా దుస్తులు విప్పేసి నగ్నంగా తిరిగి షాకిచ్చింది.

Read also: ఉక్కపోతగా ఉందని.. విమానం డోరు తెరిచిన మహిళ

ఈ సమాచారం తెలియగానే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. బహిరంగ ప్రదేశంలో ఎందుకలా చేశావని అడిగిన పోలీసులకు ఆమె తిక్క తిక్కగా సమాధానం ఇచ్చింది. వాతావరణం చాలా వేడిగా ఉందని, ఉక్కపోత తట్టుకోలేక దుస్తులు విప్పేశానని చెప్పింది. ఫ్రెండ్‌ను కలిసేందుకు బయటకు వచ్చానని, వేడి ఎక్కువగా ఉండటం వల్ల తిరిగి ఇంటికి బయల్దేరానని తెలిపింది. పోలీసులు ఆమెపై ‘బహిరంగ ప్రాంతంలో అసభ్యకర ప్రవర్తన’ కింద కేసు నమోదు చేశారు. ఆ సమయంలో ఆమె మద్యం తాగలేదని, సాధారణ స్థితిలో ఉండే ఆమె నగ్నంగా తిరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసు అక్టోబరులో విచారణకు రానుందన్నారు.

Read also: భార్య కాదు అక్క.. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత తెలిసిన చేదు నిజం, ఇప్పుడామె గర్భవతి!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here