ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మగా మారాడు.. పాకిస్థాన్‌ ప్రధానిపై మహమ్మద్‌ కైఫ్ ఫైర్

0
1


ముంబై: ఐక్యరాజ్య సమితితో భారత్‌పై విద్వేషం వెళ్లగక్కిన పాకిస్థాన్‌ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌పై మరో భారత మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ మండిపడ్డాడు. గొప్ప క్రికెటర్‌ స్థాయినుంచి పాకిస్థాన్‌ సైన్యం, ఉగ్రవాదుల చేతిలో ఇమ్రాన్‌ ఖాన్‌ కీలుబొమ్మగా మారాడని ఎద్దేవా చేశాడు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను కైఫ్‌ ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

IND vs SA: విశాఖ తొలి టెస్టులో నమోదైన రికార్డులు ఇవే!!

మోడీపై విమర్శలు:

మోడీపై విమర్శలు:

గత నెలలో న్యూయార్క్‌లో జరిగిన 74వ ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న ఇమ్రాన్‌.. భారత ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలకు దిగాడు. దేశ ప్రయోజనాల గురించి కాకుండా.. ఉగ్రవాదం, కశ్మీర్‌ అంశాల గురించి మాట్లాడాడు. ‘ఇస్లామోఫోబియా ప్రజలను విభజిస్తోంది. ముసుగు ధరించడం ఓ ఆయుధంలా మారిపోయింది. ఓ మహిళ దుస్తులను తీసేయొచ్చు కానీ, మరిన్ని దుస్తులు ధరించలేని పరిస్థితి ఉంది. ప్రత్యేకించి 9/11 దాడి తర్వాత పాశ్చాత్య దేశాల నాయకులు కొందరు ఇస్లాంకి, టెర్రరిజంకి ముడిపెట్టడం వల్ల ఇలా జరిగింది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత్‌తో సహా మిగతా దేశాలు కూడా ఖండించాయి.

ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మ:

భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని కూడా ఇమ్రాన్‌ఖాన్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాజాగా కైఫ్‌ స్పందించాడు. ‘ఉగ్రవాదాన్ని వెంటబెట్టుకుని ఇప్పటికే పాకిస్థాన్‌ చాలా చేసింది. పాకిస్థాన్‌ టెర్రరిస్టుల తయారీ కేంద్రంగా మారింది. ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్‌ చేపట్టాల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. ఐరాసలో మీరు చేసిన ప్రసంగం చూస్తే.. గొప్ప ఆటగాడి నుంచి పాక్‌ సైన్యం, ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మగా మారారు’ అని అన్నాడు.

సెహ్వాగ్ పంచ్:

సెహ్వాగ్ పంచ్:

ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంపై ఓ అమెరికన్ ఛానల్‌‌ స్పష్టత తీసుకునే క్రమంలో ఆయన ఏదో తప్పుగా మాట్లాడారు. ఈ వీడియోని తన ట్విట్టర్‌లో షేర్ చేసిన మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. తనను తాను కించపరుచుకునేందుకు కొత్త మార్గాలు కనిపెట్టారంటూ ట్విటర్‌లో సెహ్వాగ్ పేర్కొన్నాడు.

గంగూలీ కౌంటర్‌:

గంగూలీ కౌంటర్‌:

సౌరవ్‌ గంగూలీ కూడా ఇమ్రాన్‌ ఖాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. ‘వీరూ.. ఆ వీడియోను చూసి షాక్‌ గురయ్యా. అది వినకూడని ప్రసంగం. ప్రపంచం మొత్తం శాంతిని కోరుకుంటుంటే.. పాకిస్తాన్‌ మాత్రం వేరే ఆలోచిస్తోంది. ‘శాంతి’ పాకిస్తాన్‌కు చాలా అవసరం. అదొక చెత్త స్పీచ్‌. ఇప్పుడు ఇమ్రాన్‌ ఒక క్రికెటర్‌గానే ప్రపంచానికి తెలియలేదు.. ఐక్యరాజ్యసమితిలో చెత్త ప్రసంగం చేసి కూడా తెలిసారు’ అని గంగూలీ ట్వీట్ చేసాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here