ఉత్తమ ఫలితాలు సాధించాలి

0
1


ఉత్తమ ఫలితాలు సాధించాలి


ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో జనార్దన్‌రావు

పొతంగల్‌(కోటగిరి), న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు పేర్కొన్నారు. పొతంగల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన ఎస్‌ఏ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభను చూశారు. ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను సూచించారు. బోధనలో ఉన్నత ప్రమాణాల కోసం చేపట్టాల్సిన విధానాలను సిద్ధం చేసుకోవాలన్నారు. మిగతా తరగతుల విద్యార్థులకు సామర్థ్యాలను పెంపొందించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో నాగ్‌నాథ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here