ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

0
2


ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

మాట్లాడుతున్న సీఐ మాహేష్‌గౌడ్‌

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: దేవీ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ మహేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. డీజేలకు అనుమతి లేదన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై కోనారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కోటగిరి: దేవీ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోటగిరి ఎస్సై శోభన్‌బాబు పేర్కొన్నారు. దుర్గామాత మండపాల కమిటీ సభ్యులతో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. అవసరమైతే పోలీసులను సంప్రదించాలన్నారు. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here