ఉత్సాహంగా సాగుతున్న క్రీడలు

0
1


ఉత్సాహంగా సాగుతున్న క్రీడలు


వెల్మల్‌లో క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ప్రతినిధులు

వెల్మల్‌, న్యూస్‌టుడే: వెల్మల్‌లో అంతర పాఠశాలల క్రీడలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బుధవారం మూడో రోజు అర్చరీ జాతీయ క్రీడాకారుడు మద్దుల మురళి, తొండాకూర్‌ సర్పంచి దేవన్న హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీలు దగ్గరుండి పోటీలు నిర్వహిస్తున్నారు.

విజేతలు వీరే: వాలీబాల్‌ జూనియర్‌ బాలుర విభాగంలో నూతుపల్లి బీసీ గురుకుల విద్యార్థులకు ప్రథమ, జడ్పీహెచ్‌ఎస్‌ డొంకేశ్వర్‌కు ద్వితీయ, జూనియర్‌ బాలికల విభాగంలో నందిపేట్‌ ఆదర్శ పాఠశాలకు ప్రథమ, జడ్పీహెచ్‌ఎస్‌ వెల్మల్‌ ద్వితీయ, సబ్‌ జూనియర్‌ బాలుర, బాలికల విభాగాల్లో జడ్పీహెచ్‌ఎస్‌ డొంకేశ్వర్‌కు ప్రథమ, ప్రోబెల్స్‌ ద్వితీయ స్థానాలు దక్కించుకొన్నాయి.


క్రీడాకారులతో ఆర్మూర్‌ ఎంపీపీ నర్సయ్య, తెరాస నాయకులు

ఫత్తేపూర్‌(ఆర్మూర్‌ గ్రామీణం): ఫత్తేపూర్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అంతర పాఠశాలల క్రీడలు కొనసాగుతున్నాయి. బుధవారం క్రీడాకారులకు ఖోఖో, వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. గురువారం బాల బాలికల జూనియర్‌, సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలు ఉంటాయని క్రీడల కన్వీనర్‌ వెంకట్‌ నర్సయ్య, నిర్వహణ కార్యదర్శి మునిరాజ్‌ తెలిపారు.

ఆర్మూర్‌ పట్టణం: చదువుతో పాటు ఆటలు ముఖ్యమేనని ఎంపీపీ పస్క నర్సయ్య పేర్కొన్నారు. జడ్పీ బాలుర పాఠశాలలో కొనసాగుతున్న సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ మహిళా జట్టు శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. జాతీయ జట్టుకు ఎంపికైన మమతను అభినందించారు. కార్యక్రమంలో తెరాస నియోజకవర్గ బాధ్యుడు రాజేశ్వర్‌ రెడ్డి, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగామోహన్‌, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here