ఉద్యమంలా చేపడితేనే పరిశుభ్రత

0
1


ఉద్యమంలా చేపడితేనే పరిశుభ్రత

పనులు పరిశీలిస్తున్న నిజామాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు

చందూర్‌(వర్ని), న్యూస్‌టుడే: పంచాయతీ ప్రణాళికను నిరంతరం ఉద్యమంలా చేపడితేనే పల్లెలు పరిశుభ్రంగా ఉంటాయని, పాలిథిన్‌ సంచుల నివారణ సాధ్యమని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు సూచించారు. చందూర్‌ మండల కేంద్రంలో శనివారం ఆయన పర్యటించారు. మిషన్‌ భగీరథ, 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న పనులను పరిశీలించారు. మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పచ్చదనంతో పల్లెలు కళకళలాడేలా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. చెత్తాచెదారాన్ని రోడ్లు, మురుగు కాలువల్లో వేయొద్దన్నారు. సర్పంచి కర్లం సాయిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రణాళిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here