ఉద్యాన శాఖ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

0
1


ఉద్యాన శాఖ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

జామతోటను పరిశీలిస్తున్న ఉద్యానశాఖ జిల్లా అధికారి నర్సింగ్‌దాస్‌

బుస్సాపూర్‌(మెండోరా), న్యూస్‌టుడే: రైతులు ఉద్యాన శాఖ అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి నర్సింగ్‌దాస్‌ అన్నారు. బుస్సాపూర్‌లో నోముల రవి అనే రైతు సాగు చేస్తున్న జామ, శ్రీగంధం తోటను గురువారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు అయిదు ఎకరాల్లో జామ, శ్రీగంధం చెట్లతో పాటు అంతరపంటగా కూరగాయలు సాగు చేపట్టడం అభినందనీయమన్నారు. జామ చెట్లకు పురుగు ఆశించకుండా, ఎదుగుదలకు మందులను సూచించారు. బిందుసేద్యం వినియోగించి తక్కువ నీటితో పండ్లు, పూలు, కూరగాయలను పండించి అధిక ఆదాయం పొందొచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతులకు రాష్ట్రీయ కృషివికాస్‌ యోజన కింద శాశ్వత కూరగాయల పందిరి, మల్చింగ్‌ రాయితీపై అందజేస్తున్నామన్నారు. కావల్సిన రైతులు ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. వెంట మండల ఉద్యానశాఖ అధికారి రోహిత్‌, ఉద్యాన విస్తరణాధికారి సుధీర్‌, రైతులు ప్రవీణ్‌రెడ్డి, జైడి సాయన్న పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here