ఉద్యోగం కోల్పోయిన 7 లక్షలమందికి ఉపాధి కల్పించిన రంగాలివే!!

0
0


ఉద్యోగం కోల్పోయిన 7 లక్షలమందికి ఉపాధి కల్పించిన రంగాలివే!!

ఏడాదికి పైగా భారీగా తగ్గిన ఆటో సేల్స్ అక్టోబర్ నెలలో కాస్త పుంజుకున్నాయి. కొంతకాలం సేల్స్ లేక ఆటో రంగం డీలాపడటంతో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆటో రంగంతో పాటు వివిధ రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఆయా దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఇలా ఉద్యోగాలు కోల్పోయినవారిలో చాలామందికి కొత్తతరం కంపెనీలు ఉపాధి కల్పించాయి.

7 లక్షల మందికి ఉపాధి

ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 7 లక్షలమందిని కొత్త తరం పరిశ్రమలు ఆదుకున్నాయట. ఆన్ లైన్ మార్కెటింగ్, ఫుడ్ టెక్ అగ్రిగేటర్లు, ఫిన్ టెక్ సంస్థలు ఈ పండుగ సీజన్లో 7,00,000 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నాయి. ఆర్థిక మందగమన ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది వీటిల్లో చేరారు.

తాత్కాలిక ఉపశమనం

తాత్కాలిక ఉపశమనం

అయితే ఈ ఉద్యోగాలు వారికి 6 నుంచి 8 నెలలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వీరిని ఉద్యోగంలోకి తీసుకొని సేల్స్ ఎక్కువగా ఉన్న సమయంలో ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత చాలామందికి ఉద్యోగాలు ఉండవు. అంటే ఈ ఉద్యోగాలు చాలామందికి తాత్కాలిక ఉపశమనం. ఈ 7 లక్షల ఉద్యోగాల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలో 1,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాయట.

సరాసరిగా రూ.30వేల వేతనం

సరాసరిగా రూ.30వేల వేతనం

సేల్స్‌లో ఉద్యోగాలు 30 శాతం మేర పెరిగాయట. ఓ సంస్థ లెక్కల ప్రకారం దసరా, దీపావళి పండుగ సీజన్లో ఆరున్నర లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో డిమాండ్ తగ్గినా పై రంగాల్లో నియామకాలు పెరిగాయి. డెలివరీ, అనుబంధ విభాగాలు, సరఫరా వ్యవస్థ, విక్రేతల గోడౌన్‌లలో నియామకాలు జరిగాయి. వీరి సరాసరి వేతనాలు రూ.30వేల వరకు ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here