ఉద్యోగాల జాతర: మరో 2.60 లక్షల ఉద్యోగాలు ప్రకటించిన జగన్

0
0


ఉద్యోగాల జాతర: మరో 2.60 లక్షల ఉద్యోగాలు ప్రకటించిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతాకావిష్కరణ అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇప్పటికే సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు ప్రకటించారు. మరో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామన్నారు.

కొత్తగా మరో 2.66 లక్షల ఉద్యోగాలు

గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుపడుతుందని, అందుకే గ్రామ సెక్రటరియేట్‌లను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే నగరాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామని జగన్ చెప్పారు. పర్మనెంట్ జాబ్‌తో పాటు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే లక్షల ఉద్యోగాలు ప్రకటించామని, మరో 2.66 లక్షల ఉద్యోగాలను ఇవ్వనున్నామన్నారు.

స్థానికులకు అవకాశాలు

స్థానికులకు అవకాశాలు

రైతులకు, పేదలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు జగన్ తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో డెబ్బై అయిదు శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తామని, పరిశ్రమల కోసం దరఖాస్తు చేసినప్పుడే ట్రెయినింగ్ ద్వారా స్థానికులకు అండగా ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్స్ ఇవ్వాలని చట్టం చేశామని, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పనుల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు.

పెన్షన్ పెంపు…

పింఛన్‌ను వెయ్యి రూపాయల నుంచి రూ.2250కి పెంచామని, ప్రతి ఏటా రూ.250 పెంచుతామని జగన్ చెప్పారు. పింఛన్ అర్హత వయస్సును 60 ఏళ్లకు తగ్గించామన్నారు. రైతులకు రూ.12,500 రైతు భరోసా ఇస్తున్నామని, ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే కుటుంబానికి రూ.7 లక్షలు ఇస్తున్నామని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here