ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్, ఆ కారణంతో 7,000 ఉద్యోగాల తొలగింపు!

0
0


ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్, ఆ కారణంతో 7,000 ఉద్యోగాల తొలగింపు!

బెంగళూరు: రానున్న త్రైమాసికాల్లో కాగ్నిజెంట్ 7,000 మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగుల తొలగింపుతో పాటు కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి తప్పుకోనుంది. వ్యూహాత్మక పునర్మిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరింతమంది ఉద్యోగులను కూడా తగ్గించుకోనుంది. దీని వల్ల మరో 6,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుంచి నిష్క్రమించనున్న నేపథ్యంలో వేలాది ఉద్యోగాలు పోనున్నాయి. అలాగే, క్లౌండ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్ వంటి వృద్ధి రంగాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మరికొన్ని వేలమంది ఉద్యోగులను తగ్గించుకోనుంది.

కాగ్నిజెంట్ ఉద్యోగుల తొలగింపు

కంటెంట్ మోడరేషన్ వ్యాపారంలో కొన్ని విభాగాల నుంచి నిష్క్రమించడం రాబోయే సంవత్సరంలో ఆర్థిక పనితీరును దెబ్బతీస్తుందని కాగ్నిజెంట్ తెలిపింది. ఈ మేరకు న్యూజెర్సీలోని కంపెనీ హెడ్ క్వార్టర్లో కాగ్నిజెంట్ ప్రతినిధి… అనలిస్ట్స్‌తో మాట్లాడారు. 10,000 నుంచి 12,000 మంది మిడ్ సీనియర్ ఉద్యోగులను ప్రస్తుతం వారి రోల్స్ నుంచి తొలగించనున్నట్లు చెప్పారు. ఇందులో దాదాపు 5వేల మందిని తొలగించనున్న ఉద్యోగుల స్థానాల్లో నియమిస్తారు. కంపెనీలో ఐదు వేల నుంచి ఏడువేల మంది ఉద్యోగుల తొలగింపు ఉంటుందని, ఇది ఆ కంపెనీ ఉద్యోగుల్లో ఇది 2 శాతమని చెబుతున్నారు.

ఫేస్‌బుక్‌కు కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్‌గా

ఫేస్‌బుక్‌కు కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్‌గా

కాగ్నిజెంట్ కంటెంట్ మోడరేషన్ బిజినెస్‌లోను ఉంది. ఇది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని భావిస్తోంది. కంటెంట్ మోడరేషన్ బిజినెస్‌ను మూసివేస్తే కంపెనీ కమ్యూనికేషన్ వ్యవస్థ, మీడియా, టెక్నాలజీ సెగ్మెంట్ రెవెన్యూ పైన ప్రభావం చూపుతుంది. రానున్న ఒకటి రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

పూర్తిగా నిష్క్రమించలేదు...

పూర్తిగా నిష్క్రమించలేదు…

కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి నిష్క్రమించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని, అయినప్పటికీ వారితో మరో విధంగా కలిసి పని చేస్తామని తెలిపింది. తద్వారా ఉద్యోగాల తొలగింపు పైన ప్రభావం తగ్గుతుందని అభిప్రాయపడింది. కాగా, కాగ్నిజెంట్ చర్య సంస్థ కొత్త వ్యూహాన్ని ప్రతిబింబిస్తుందని, అయితే కంటెంట్ మోడరేషన్ నుండి పూర్తిగా నిష్క్రమించలేదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here