ఉద్యోగులకు గుడ్‌న్యూస్: చైనా కంటే భారత్ బెటర్, 2020లో శాలరీ 10% పెరుగుతుంది!

0
1


ఉద్యోగులకు గుడ్‌న్యూస్: చైనా కంటే భారత్ బెటర్, 2020లో శాలరీ 10% పెరుగుతుంది!

ఇటీవల ఆటో ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ సహా పలు రంగాల్లో తీవ్ర మందగమనం కనిపించింది. దీంతో చాలా ఉద్యోగాలు కోల్పోయాయి. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు ఉద్దీపన చర్యలు చేపట్టింది. దీంతో ఆటో సేల్స్ పుంజుకున్నాయి. ఇదిలా ఉండగా భారతీయ ఉద్యోగులకు ఓ శుభవార్త. వచ్చే ఏడాది ఇండియాలో ఇండస్ట్రీస్ ఉద్యోగుల వేతనాలు 10 శాతం పెరగనున్నాయని హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెన్సీ కంపెనీ విల్లిస్ టవర్ వాట్సాన్ అంచనా వేసింది. ఇండియాలో కంపెనీలు ఆచితూచి అడుగు వేస్తున్నాయని, ఈ నేపథ్యంలో 2020లో నియామకాలు మందగిస్తాయని మరో చేదు వార్త చెప్పింది.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇండియాలోనే ఎక్కువ

2019లో జీతాలు 9.9% పెరిగాయని, భారత్‌లో జీతాల పెరుగుదల 10% స్థిరపడిందని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే అధిగమని తెలిపింది. ఇది ఇండోనేషియాలో 8%, చైనాలో 6.5%, ఫిలిప్పైన్స్‌లో 6%, హాంకాంగ్‌లో 4% మాత్రమేనని విల్లిస్ టవర్ వాట్సాన్ పేర్కొంది. వచ్చే ఏడాది ఇండియాలో వేతనాలు 10 శాతం పెరుగుతాయని ఈ నివేదిక తెలిపింది.

ఇతర దేశాల కంటే భారత్‌లోనే ఆశాజనకం

ఇతర దేశాల కంటే భారత్‌లోనే ఆశాజనకం

ఈ ఏడాది 9.9%గా ఉన్న వృద్ధి మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది మాత్రం పది శాతం తాకుతుందని విల్లిస్ టవర్ వాట్సాన్ తెలిపింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్‌లోనే ఆశాజనక పరిస్థితులున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

మధ్యశ్రేణి ఉద్యోగులకు ఎక్కువగా పెరిగే ఛాన్స్

మధ్యశ్రేణి ఉద్యోగులకు ఎక్కువగా పెరిగే ఛాన్స్

ఆటోమేషన్, డిజిటలైజేషన్ మధ్య కూడా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్ని వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని ఈ నివేదిక తెలిపింది. అయితే ఉన్నత ఉద్యోగులు, దిగువ శ్రేణి ఉద్యోగులతో పోలిస్తే మధ్యస్త ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక ఈ అధ్యయనంలో పాల్గొన్న సంస్థల వ్యాపార వృద్ధి వచ్చే ఏడాది కాలంలో 28 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అయితే 2018లో ఇది 37%గా ఉంది.

నియామకాల్లో మందగమనం

నియామకాల్లో మందగమనం

ఉద్యోగుల వేతనాలు 2013లో 11 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆరేళ్ల తర్వాత 10 శాతాన్ని చేరుకోనుందని అంచనా వేసింది. అయితే నియామకాలు మందగిస్తాయని రిపోర్ట్ అంచనా వేసింది. 2018లో పలు కంపెనీల హెడ్ కౌంట్ 63 శాతంగా ఉండగా, 2019లో 70శాతానికి పెరిగింది. దీనిని అలాగే కొనసాగించాలని భావిస్తున్నాయి. 7 శాతం కంపెనీలు మాత్రం గత ఏడాది 8 శాతం హెడ్ కౌంట్‌తో పోలిస్తే తగ్గించాలని చూస్తున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here