ఉద్యోగులకు విప్రో భారీ ఆఫర్, ఉండండి.. రూ.1 లక్ష బోనస్ ఇస్తాం

0
1


ఉద్యోగులకు విప్రో భారీ ఆఫర్, ఉండండి.. రూ.1 లక్ష బోనస్ ఇస్తాం

బెంగళూరు: ఉద్యోగుల వలస రేట్లు తగ్గించేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రెషర్స్‌తో సహా జూనియర్ ఉద్యోగులకు భారీ బొనాంజా ప్రకటించారు. ఐటీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వలసలు ఉంటాయి. ఉద్యోగుల వలసలతో పెద్ద పెద్ద కంపెనీలు ఇబ్బంది పడతాయి. దీనిని ఎదుర్కొనేందుకు విప్రో లక్ష రూపాయల బోనస్ పేమెంట్ ప్రకటించింది. కంపెనీ మారకుండా విప్రోలోనే ఉండేవారికి నగదుగా ఈ మొత్తం ఆఫర్ చేసింది.

రూ.1 లక్ష వరకు బోనస్

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలక్ట్ అయి విప్రోలో గత కొంతకాలంగా పని చేస్తున్న ఫ్రెషర్లకు, జూనియర్లకు ఈ ఆఫర్ ఇచ్చింది. వలసలు నివారించేందుకు, ఉద్యోగులను నిలుపుకునేందుకు విప్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. క్యాంపస్ నియామకం నుంచి కంపెనీలో పని చేస్తున్న, దాదాపు మూడేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారి వరకు ఏడాదికి రూ.1 లక్ష బోనస్ ఇస్తామని కంపెనీ ప్రకటించిందట.

వారికి 10 శాతం హైక్

వారికి 10 శాతం హైక్

మూడు నుంచి నాలుగేళ్ల అనుభవం ఉన్నవారికి విప్రో 10 శాతం శాలరీ హైక్ ఇచ్చింది. డిజిటల్ స్కిల్స్ కలిగిన వారికి మంచి ఇంక్రిమెంట్ ఇచ్చింది. అదే సమయంలో లో-పర్ఫార్మర్స్‌కు ఎలాంటి హైక్, బొనాంజా ప్రకటించలేదని తెలుస్తోంది. మేనేజర్స్ స్థాయి, లీడర్‌షిప్ లెవల్స్‌లో ఉన్న వారికి 4 నుంచి 5 శాతం వేతనాలు పెంచింది.

వలసలు నిరోదించేందుకు..

వలసలు నిరోదించేందుకు..

ఉద్యోగులకు భారీ ఆఫర్ ఇవ్వడం ద్వారా వలసలు నిరోధించడంతో పాటు డిజిటల్ సేవలను మరింత విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని విప్రో భావిస్తోంది. అయితే కంపెనీలో కనీసం ఏడాది పాటు కచ్చితంగా పని చేసినవారికి ఇది వర్తింప చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో విప్రో 6,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఇదే సమయంలో వలసల రేటు 17.9 శాతంగా ఉంది. ఉద్యోగుల వలసల్ని నివారించేందుకు విప్రో బాటలోనే ఇతర ఐటీ దిగ్గజాలు సాగే అవకాశముంది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రోలలో ఉద్యోగులు తరుచూ వలస వెళ్తుంటారు. జూనియర్ ఉద్యోగులు తక్కువ హైక్స్‌కు కంపెనీలు మారుతుంటారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here