ఉద్యోగుల షూలు విప్పి, కాళ్లు కడిగిన బాసులు.. వీడియో వైరల్!

0
2


ద్యోగులు తమ పనితో బాసులను మెప్పించడం అంత సులభమైన పనికాదు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోతే.. వారి శ్రమ వృథా అయినట్లే. ఒకవేళ మంచి ఫలితాలు వచ్చినా.. ‘వాట్ నెక్ట్స్’ అంటూ కొత్త టార్గెట్లు ఇస్తారు. దీంతో చాలామంది తమ బాస్ తిట్టకుండా ఉంటే చాలు.. అదే పదివేలు అనుకుంటారు. అయితే, చైనాలోని ఆ సంస్థలో మాత్రం కష్టపడి పనిచేసే ఉద్యోగులను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అంతేకాదు, వారి శ్రమను గుర్తించి.. ఉద్యోగుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటారు.

Also Read: ఐదేళ్ల వయస్సులో గర్భం, లినా మెడినా.. ప్రపంచంలోనే అతి చిన్న ‘తల్లి’

జినాన్ ప్రాంతంలోని ఓ సంస్థలో నవంబరు 2న ఉత్తమ ఉద్యోగుల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ సంస్థకు చెందిన ఇద్దరు సినీయర్ మహిళా అధికారులు.. బాగా పనిచేసిన తమ కింది ఉద్యోగులను వేదిక కూర్చొబెట్టారు. అనంతరం వారి షూలు విప్పి కాళ్లు కడిగారు. సంస్థ అభివృద్ధికి చేస్తున్నా సాయానికి గాను ఉద్యోగులందరికీ చేతులు జోడించి నమస్కరించారు.

Also Read: బాత్‌టబ్‌లో మహిళ శవం, వికటించిన సెక్స్ గేమ్? మిస్టరీగా మారిన కేసు!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. తమ కింద ఉద్యోగుల ముందు మోకరిల్లి.. వాళ్ల కాళ్లు కడగడం కంటే.. ఆ ఉద్యోగుల జీతాలను పెంచినట్లయితే మరింత ప్రోత్సాహకరంగా ఉండేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇలాంటి బాసులు మాకెందుకు లేరని తెగ ఫీలైపోతున్నారు. మరి, ఈ బాసుల గురించి మీరు ఏమంటారు?

వీడియో:Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here