ఉద్రికత్త పరిస్థితులు.. వంద మందికి పైగా క్రికెటర్ల తరలింపు

0
2


శ్రీనగర్‌: టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో సహా వంద మందికి పైగా యువ క్రికెటర్లు, సహాయక సిబ్బంది జమ్ముకశ్మీర్‌ నుంచి తరలివెళ్లాలని ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం సీఈవో సయ్యద్‌ ఆశిక్‌ హుస్సేన్‌ బుఖారీ చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది. కశ్మీర్‌ లోయలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెటర్లందరినీ తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

థాయ్‌లాండ్‌ ఓపెన్‌.. చరిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ

ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ క్రికెట్‌ జట్టుతో కలిసి పనిచేస్తున్నాడు. జమ్ముకశ్మీర్‌ జట్టుకు ఆటగాడిగా, మెంటార్‌గా ఉన్నాడు. ‘ప్రస్తుతం ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో పఠాన్‌తో పాటు శిక్షకుడు సుదర్శన్‌ ఆదివారం కశ్మీర్‌ లోయ నుండి వెళ్లిపోతున్నారు. రాబోయే రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో జరగాల్సిన అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నాం. పరిస్థితులు సద్దుమణిగాక మళ్లీ క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తాం’ అని బుఖారీ తెలిపినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

యువరాజ్‌ మెరుపులు.. 22 బంతుల్లో అర్ధ సెంచరీ

అమర్‌నాథ యాత్రకు వచ్చే భక్తులకు ముప్పు పొంచి ఉందనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ఇంటిలిజెన్స్ బ్యూరో సూచన మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘జమ్ము కశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జమ్ము నుండి విద్యార్దులు, పర్యాటకులు తమ స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కశ్మీర్‌లో తెలుగు ప్రజలు సహా మరెవరి భద్రతకు ఢోకా లేదు’ అని కిషన్ రెడ్డి తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here