ఉన్నదాంట్లో పేదలకు సహాయం చేయాలి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్లో గల జామా మసీదు పార్కింగ్‌ నిర్మాణాలను మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ శుక్రవారం ప్రారంభించారు. స్వంతంగా నాలుగు లక్షల నిధులు ఇవ్వడంతో పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మైనారిటీ పెద్దలు షబ్బీర్‌ అలీని ఘనంగా సన్మానించారు. అనంతరం మత పెద్దలు మాట్లాడుతూ షబ్బీర్‌ అలీ కషితో రాష్ట్రంలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌ కొనసాగుతోందని, ఈ విధానంతో ఎంతో మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇంజినీర్లు, డాక్టర్లుగా మంచి స్థానాలను సంపాదించుకున్నారన్నారు. షబ్బీర్‌ అలీ సాధించిన నాలుగు శాతం రిజర్వేషన్‌ ప్రభావం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పడిందన్నారు. జాతీయ స్థాయిలో షబ్బీర్‌ అలీని ఆదర్శంగా తీసుకుని మైనారిటీ మత పెద్దలు తమ రాష్ట్రాల్లో కూడా నాలుగు శాతం విధానాన్ని అమలు చేయాలని పోరాడుతున్నారని ప్రశంసించారు. కామారెడ్డి జామా మసీదు అభివధ్ధికి షబ్బీర్‌ అలీ 16 లక్షల రూపాయలు ఖర్చు చేశారని, కామారెడ్డి నియోజకవర్గంలో ఏ ముస్లిం నిరుపేద చనిపోయినా అంత్యక్రియల కోసం 15 సంవత్సరాలుగా సొంతంగా 5 వేల రూపాయలు అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మసీదు వద్ద పార్కింగ్‌ నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడంతో పార్కింగ్‌ నిర్మాణం పూర్తయిందన్నారు. షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటామని, కామారెడ్డి నియోజక అభివద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదాంట్లో ఎంతో కొంత పేదలకు సహాయం చేయాలని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here