ఉపకార వేతనాల కోసం నిరసన

0
3


ఉపకార వేతనాల కోసం నిరసన

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఉపకార వేతనాలు, బోధనా రుసుములు విడుదల చేయాలని బోధన్‌లో ఏబీవీపీ కార్యకర్తలు మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. పట్టణంలో విద్యార్థులు అంబేడ్కర్‌చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా చేపట్టి తమ డిమాండ్లు వినిపిస్తూ నినాదాలు చేశారు. అనంతరం సమస్యలు వివరిస్తూ ప్రభుత్వ మనసు మార్చాలని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఉపకార వేతనాలు, బోధనా రుసుములను తక్షణమే విడుదల చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి రమేష్‌, జోనల్‌ ఇన్‌ఛార్జి విఠల్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా హరి, భగవాన్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here