ఊదా రంగులో మారిన మూత్రం.. షాకైన వైద్యులు, కారణం ఇదేనట!

0
2


ఫ్రాన్స్ రాజధాని పారీస్‌లో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‌తో అస్వస్థతకు గురైన 70 ఏళ్ల మహిళ‌ అకస్మాత్తుగా పక్షవాతానికి గురైంది. కదల్లేని పరిస్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. చిన్న పైపుతో ఓ బ్యాగ్‌లోకి మూత్రం పోసుకొనే ఏర్పాటు చేశారు.

Also Read: నీలం రంగులో మారిన మహిళ రక్తం.. పంటి నొప్పి తెచ్చిన తంటా!

పది రోజుల తర్వాత ఆ ఆమె యూరిన్ బ్యాగ్‌ను పరిశీలించిన నర్సులు.. ఆమె మూత్రం ఊదా(వంకాయ) రంగులో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వైద్యులకు ఈ విషయం చెప్పారు. ఆ మూత్రాన్ని పరిశీలించిన వైద్యులు ఆమె ‘పర్పుల్ యురినరీ బ్యాగ్ సిండ్రోమ్’ (PUBS) సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ అరుదైన కేసును ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ గురువారం ప్రచురించింది.

Also Read: చనిపోయిన తండ్రి ఫోన్‌కు 4 ఏళ్లుగా కూతురు మెసేజ్‌లు.. చివరికి రిప్లై వచ్చింది!

క్షార సాంద్రత వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఆమె మూత్రంలో రసాయన ప్రతిచర్య (కెమికల్ రియాక్షన్) జరిగినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. ‘అన్నాల్స్ ఆఫ్ లాంగ్ టెర్మ్ కేర్’లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 1978లో తొలిసారిగా ఇలాంటి కేసు నమోదైందని పేర్కొంది. వృద్ధాప్యంలో మూత్ర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని యూరినరే ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారని (UTI) అంటారని తెలిపింది. మూత్ర సమస్య ఎదుర్కొన్న పారీస్ మహిళలో మాత్రం UTI సమస్య కనిపించలేదని తెలిపింది. వైద్యులు ఆమెకు ఇంట్రావీనస్ హైడ్రేషన్ ద్వారా చికిత్స అందించారని, నాలుగు రోజులు తర్వాత ఆమె మూత్రం సాధారణ రంగులోకి మారిందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here