ఋతుస్రావం- పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఋతుస్రావం (నెలసరి పీరియడ్స్‌) బహిరంగంగా చర్చించుకునేందుకు ముందుకు రావాలని జిల్లా సెషన్‌ జడ్జి పి శ్రీ సుధ అన్నారు. బ్లడ్‌ ఫర్‌ ఫ్రైడ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల కమ్యూనిటీ హెల్త్‌ విభాగం సంయుక్త సహకారంతో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో మాధవ నగర్‌ లోని ఎస్‌ఎస్‌ఆర్‌ డిస్కవరీ పాఠశాలలో ఋతుస్రావం- పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సెషన్‌ జడ్జి మాట్లాడుతూ ఋతుస్రావం పట్ల మహిళల్లో అనాదిగా వస్తున్న అపోహలను తొలగించేందుకు అందరూ కషిచేయాలని చెప్పారు. ఈ విషయంపై పబ్లిక్‌ మాట్లాడడం తప్పుగా భావిస్తున్నారని నేటి తరానికి పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. యంగ్‌ జనరేషన్‌ పూర్తి పరిశుభ్రత పాటించి ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తారని ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి మారుమూల ప్రాంతాల్లో ఉన్న మహిళలను చైతన్యవంతులను చేయడం జరుగుతుందని చెప్పారు. మారుతున్న సాంకేతిక ఆధునిక సమాజంలో కూడ ఋతుస్రావం గల మహిళలు వివక్షత చూపుతున్నారని కొన్ని దేశాలు కొన్ని జాతులలో ఇంకా కొనసాగుతున్నాయని వారిలో పూర్తిగా అవగాహన లేక పోవడానికి కారణమని చెప్పవచ్చునని, ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రులు షేర్‌ చేసుకుని ముందుకు పోవాలని ఆన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here