ఎంజాయ్ చేస్తున్నాడు, రోహిత్‌పై ఒత్తిడి పెంచొద్దు: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరాట్ కోహ్లీ

0
2


హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై మీడియా ఫోకస్ తగ్గించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం నుంచి పూణె వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ మాట్లాడాడు.

కోహ్లీ మాట్లాడుతూ “రోహిత్‌ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అతడి అనుభవాన్నంతా ఉపయోగించి తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా రెండో టెస్టులో అతడి దూకుడైన ఆటతో మ్యాచ్‌పై మాకు మరింత పట్టు దొరికింది. టాపార్డర్ బ్యాట్స్‌మన్‌ రాణింపుపైనే గెలుపోటములు ఆధారపడతాయి. రోహిత్‌ ఓపెనర్‌గా ఉండటం జట్టుకు లాభిస్తుంది” అని అన్నాడు.

రెట్టింపు పాయింట్లు ఇవ్వాల్సిందే: టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీ కొత్త సూచన

టాపార్డర్‌లో ఎంజాయ్ చేయనివ్వండి

“కమాన్! అతడొక బ్రేక్ ఇవ్వండి. అద్భుతంగా ఆడుతున్నాడు. బ్యాటింగ్ టాపార్డర్‌లో ఎంజాయ్ చేయనివ్వండి. అతడి నుంచి మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ ఆడిన తీరుని గమనిస్తే… గేమ్‌ను ముందుకు తీసుకెళ్లిన తీరు నిజంగా అద్భుతం. తొలి టెస్టులో టాపార్డర్ బ్యాట్స్‌మన్ మాదిరి ఆడాడు” అని కోహ్లీ తెలిపాడు.

టెస్టుల్లోనూ అదే ఆట

“పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎలాంటి ఆటనైతే అతడిలో చూశామో టెస్టుల్లోనూ అదే ఆటను కొనసాగించాలని కోరుకుంటున్నాం. అయితే రోహిత్‌ టెస్టుల్లో ఓపెనర్‌గా ఎలా ఆడతాడు అనే దానిపై అందరూ ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. దీంతో రోహిత్ శర్మలో ఒత్తిడి ఎక్కువైంది. క్రీడా విశ్లేషకులకు, మీడియాకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రోహిత్‌పై ఫోకస్‌ తగ్గించుకోండి” అని కోహ్లీ తెలిపాడు.

ఓపెనర్‌గా రోహిత్ సక్సెస్

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరొందిన రోహిత్ శర్మ టెస్టుల్లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ సిరిస్‌లో జట్టు మేనేజ్‌మెంట్ ఓపెనర్‌గా బరిలోకి దింపడంతో ఎలా రాణిస్తాడనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే విశాఖ టెస్టులో రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీలు చేయడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

1-0 ఆధిక్యంలో టీమిండియా

ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి ఉత్సాహంలో ఉన్న టీమిండియా… పూణె టెస్టులో కూడా విజయం సాధించి టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సఫారీ జట్టు రెండో టెస్టులో విజయం సాధించి సిరిస్‌ను సమం చేయాలని భావిస్తోంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here