ఎంబిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ జయంతి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంబిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండాలక్ష్మన్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జయంతి నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు మఠం విజయ్‌, కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1915 సెప్టెంబర్‌ 27వ తేదీన వాంకిడిలో జన్మించి నాలుగు సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఆత్మస్థైర్యంతో ఆసిఫాబాద్‌లో ప్రాథమిక విద్య, హైదరాబాదులో న్యాయ శాస్త్రం అభ్యసించారన్నారు. నాటి స్వాతంత్ర సంగ్రామంలో 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగస్వామిగా, 1947లో నిజాం నవాబుపై బాంబు వేసిన నారాయణ రావు పవార్‌ బందంలో సభ్యుడిగా ఉన్నారన్నారు. తెలంగాణ ఆకాంక్షను చాటి 1967లో భువనగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది 1969లో తెలంగాణ ఏర్పాటు కోసం రాజీనామా చేసిన తర్వాత 1972లో లో తిరిగి ఎన్నికై తెలంగాణ సాధన కోసం పోరుబాట నడిపార్నారు. నేటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌తో కలిసి ఉద్యమ పార్టీని స్థాపించిన తెలంగాణ యోధులు బాపూజీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు సాధించేందుకు బహుజన కులాలలో ఎంబిసి సంక్షేమ సంఘం కషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో బోయ శ్యామ్‌ కుమార్‌, వీరభద్రీయ వీరయ్య, మద్దెల రాజు, గోసంగి శ్రీనివాస్‌, వీరభద్రీయ జనార్ధన్‌, దత్తాత్రి పద్మశాలి తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here