ఎక్కడి చెత్త అక్కడే…

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రారంభమై 50 రోజులు కావస్తుండగా, గడిచిన 7 రోజులుగా భారీ నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రోడ్లపై, డ్రైనేజీల్లోని చెత్త చెదారం ఎక్కడి కక్కడ పేరుకు పోవడంతో దోమలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. నందిపేట్‌ మండల కేద్రంలో గత కొన్ని నెలలుగా మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడం వల్ల కాలనీల్లో ముఖ్య రహదారి వెంబడి చెత్త చెదారం ఎక్కడికక్కడే దర్శనమిస్తూ కుళ్లిన వ్యర్థాల నుండి దుర్గంధం వెదజల్లుతోందని, మండల కేంద్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గ్రామంలో పందులు స్వైర విహారం చేస్తూ ఇళ్లల్లోకి వస్తున్నాయి. పందుల బారి నుండి కాపాడాలని గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై గత పాలక వర్గంలోని గ్రామ సర్పంచ్‌, కార్యదర్శి దష్టికి తీసుకు వెళ్లగా పందుల పెంపకం దారులకు నోటీసులు ఇచ్చి పందులను వాహనాలలో ఎక్కించి ఇతర ప్రాంతాలకు తరలించారు. కానీ నూతన పాలక వర్గం ఎన్నికైనప్పటి నుండి పందుల పెంపకం దారులు మళ్ళీ పందులను తీసుకువచ్చి పెంచుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో సీజనల్‌ వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కాలనీల్లో రోడ్లు సరిగా లేక చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here