ఎటువంటి డాకుమెంట్స్ లేకుండా 10 నిమిషాల్లో పాన్ కార్డ్ ని పొందవచ్చు

0
0


ఆర్థిక లావాదేవీ విషయంలో పాన్ కార్డ్ కీలకపాత్ర పోషిస్తుంది. మనకు పాన్ కార్డ్ కావాలి అంటే, కొన్ని రకాల డాకుమెంట్స్ ని సమర్పించి 15 రోజులు wait చేస్తే మనకి పాన్ కార్డ్ ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఐటి శాఖ కొత్త ఫీచర్ ని అందుబాటులో కి తీసుకురానుంది.

ఈ ఫీచర్ ద్వారా ఒక ఆధార్ కార్డ్ తో, ఎటువంటి డాకుమెంట్స్ అవసరం లేకుండా పాన్ కార్డ్ ని మీ ఇంటి నుంచే సులభంగా పొందవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజి లో ఉంది. ఇప్పటికే 62,000 కొత్త పాన్ కార్డ్ లను ఈ ఫీచర్ ద్వారా ఐటి శాఖ  టెస్ట్ చేసింది. అన్ని సరిగ్గా కుదిరితే అతి త్వరలో ఈ ఫీచర్  సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ఇందులో మొదట మీ ఆధార్ కార్డ్ ని మీ మొబైల్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ మొబైల్ తో లింక్ చేసాక మీకు మొబైల్ కి OTP  వస్తుంది. OTP ఎంటర్ చేసాక మీ ఆధార్ verify అయ్యి మీకు పాన్ కార్డ్ జారీ అవుతుంది. మీ ఆధార్ కార్డ్ డేటా బేస్ లో మీ మొత్తం సమాచారం ఉంటుంది. డిజిటల్ సంతకం కూడా ఆధార్ కార్డ్ డేటా బేస్ లో ఉంటుంది కనుక మీరు ఎలాంటి డాకుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే మీకు పాన్ కార్డ్ మంజూరు అవుతుంది.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here