ఎడమ చేతిపై తోడేలు టాటూ: ఆసక్తికర కథ చెప్పిన నవదీప్ సైనీ (వీడియో)

0
1


హైదరాబాద్: క్రికెటర్లు తన శరీరంపై టాటూ వేయించుకోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైంది. అయితే, ఇందుకు టీమిండియా యువ పేసర్ నవదీప్ సైనీ భిన్నమేమీ కాదు. ఎడమచేతివాటం పేసర్ అయిన నవీదీపై సైనీ తన ఎడమిచేతిపై తోడేలు టాటూ వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇటీవలే బీసీసీఐ విడుదల చేసింది.

యాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం

అయితే, ఈ టాటూని తన చేతిపై ముద్రించుకోవడం వెనుకున్న ఆసక్తికర విషయాన్ని నవదీపై సైనీ తన సహచర పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పంచుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనతో నవదీప్ సైనీ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు.

నువ్వు నిజమైన చాంపియన్: డేల్ స్టెయిన్ రిటైర్మెంట్‌పై కోహ్లీ

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగిన తొలి టీ20లో నవదీప్ సైనీ అద్భుత ప్రదర్శన చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సైనీ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వెస్టిండిస్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, షిమ్రాన్ హెట్‌మెయిర్‌లను పెవిలియన్‌కు చేర్చాడు.

బీసీసీఐ టీవికి ఇంటర్యూ

బీసీసీఐ టీవికి ఇంటర్యూ

దీంతో మ్యాచ్ అనంతరం నవదీపై సైనీ మరో పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో కలిసి బీసీసీఐ టీవికి ఇంటర్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్యూలో తన చేతిపై ఉన్న తోడేలు టాటూ గురించి వివరించాడు. తన చిన్నప్పటి నుంచి సోదరుడితో కలిసి తోడేలకు సంబంధించిన సినిమాలను సైనీ ఎక్కువగా చూసేవాడంట.

సర్కస్‌లో ఎలాంటి ప్రదర్శన చేయదు

సింహం, పులి లాంటి క్రూర జంతువులను సైతం మనం సర్కస్‌లో చూస్తుంటాం. కానీ తోడేలు జంతువు అయినప్పటికీ… సర్కస్‌లో ఎలాంటి ప్రదర్శన చేయదు. అందుచేతనే తన చేతిపై తోడేలు టాటూ వేయించుకున్నానని నవదీప్ సైనీ వివరించాడు. అంతేకాదు తన చేతిపై ఉన్న టాటూని కూడా చూపించాడు.

మంచి ప్రదర్శన చేయడంపై సైనీ సంతోషం

మంచి ప్రదర్శన చేయడంపై సైనీ సంతోషం

ఇక, తన అరంగేట్రం సిరిస్‌లో మంచి ప్రదర్శన చేయడంపై నవదీప్ సైనీ సంతోషం వ్యక్తం చేశాడు. “నా అరంగేట్రంపై చాలా సంతోషంగా ఉన్నా. మ్యాచ్‌కి ముందు క్యాప్ అందుకోవడం మరిచిపోలేని అనుభూతి. తొలి వికెట్ తీసినప్పుడు నాలోని ఒత్తిడి తగ్గింది. ఇక, రెండో వికెట్ తీసిన తర్వాత ఈరోజు నాది అని అర్ధమైంది. ఇలాంటి సందర్భాల్లో హ్యాట్రిక్ వికెట్లు తీయడం నేను చూశాను. దానిపైనే దృష్టి సారించాను” అని సైనీ చెప్పుకొచ్చాడు.

మూడు టీ20ల సిరిస్‌ను 2-0తో నెగ్గిన కోహ్లీసేన

మూడు టీ20ల సిరిస్‌ను 2-0తో నెగ్గిన కోహ్లీసేన

ఈ పర్యటనలో భాగంగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 22 పరుగులు తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు టీ20ల సిరిస్‌ను మరో టీ20 మిగిలుండగానే టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ఓ అరుదైన రికార్డుని నెలకొల్పింది. పాక్ తర్వాత విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో యాభైకి పైగా విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా అవతరించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here