ఎమర్జెన్సీ ఫండ్: ఏమిటిది, ఎలా దాచిపెట్టుకోవాలి?

0
4


ఎమర్జెన్సీ ఫండ్: ఏమిటిది, ఎలా దాచిపెట్టుకోవాలి?

న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ ఫండ్… మీకు వచ్చే వేతనం లేదా మీ వ్యాపారం ద్వారా వచ్చే సంపాదనతో సాధారణ ఖర్చులు ఉండటం సహజం. అయితే అత్యవసర సమయంలో లేదా అనుకోకుండా ఎదురయ్యే పరిణామాలకు ఎంతోకొంత అవసరమవుతుంది. అలాంటి సందర్భాలలో చేతిలో చిల్లిగవ్వ లేకుంటే కష్టమే. అయితే ప్రణాళికతో ఆదా చేస్తే ఎమర్జెన్సీ ఫండ్ ద్వారా ఇలాంటి వాటిని అధిగమించవచ్చు. టెక్నాలజీ రంగం, స్టార్టప్ రంగాల్లో ఉద్యోగ భద్రత కరువైంది. ఆ మాటకు వస్తే దాదాపు అన్ని రంగాల్లోని వారి పరిస్థితి ఇదే. ఆటోమొబైల్ రంగంలో గత మూడు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇటీవల జెట్ ఎయిర్వేస్ అనూహ్యంగా తన సర్వీసులను నిలిపివేసింది. దీంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసుకోవాలి

ఉద్యోగంపోతే లేదా హఠాత్తుగా కంపెనీ మూతబడితే ఉద్యోగుల కష్టాలు చెప్పలేనివి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతారు. లేదా ఉద్యోగులకు హఠాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బుల అవసరం ఏర్పడినా ఆందోళనకరమే. ప్రస్తుత కాలంలో అలాంటి పరిస్థితికి దాదాపు అందరూ సిద్ధంగానే ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే ముందునుండి జాగ్రత్త పడితో ఇలాంటి క్లిష్ట పరిస్థితులను కాస్త ఉపశమనం కలిగేలా చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ ఫండ్‌ను ప్లాన్ చేసుకోవాలి.

లిక్విడ్‌గా ఉంచుకోవడం మంచిది

లిక్విడ్‌గా ఉంచుకోవడం మంచిది

ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసుకుంటే హఠాత్తుగా వచ్చే అవసరాలకు ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే సాధ్యమైనంత వరకు దీనిని లిక్విడ్‌గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అత్యవసరమైనప్పుడు వెంటనే డబ్బు అందుబాటులో ఉంటుంది.

ఛార్జీలు లేకుండా చూసుకోవాలి

ఛార్జీలు లేకుండా చూసుకోవాలి

నిధులు తీసుకునే సమయంలో ఎలాంటి విత్ డ్రా పెనాల్టీ లేదా ఛార్జీలు లేకుండా చూసుకోవాలి. పెట్టుబడి పెట్టిన మొత్తం విలువ రాబడిగా ఉండాలి. అందులో ఎలాంటి తగ్గింపులు ఉండకుండా ప్లాన్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ రాత్రికి రాత్రే తయారయ్యేది కాదు.

సాధారణ ఖర్చుల కోసం వినియోగించవద్దు

సాధారణ ఖర్చుల కోసం వినియోగించవద్దు

ఓ బ్యాంకు అకౌంట్ లేదా ఇతర మార్గాల ద్వారా ప్రతి నెల కొంత మొత్తం పక్కన పెట్టే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని సాధారణ ఖర్చుల కోసం ఎట్టి పరిస్థితుల్లోను వినియోగించవద్దు. ప్రతి నెల ఇలా జమ చేయడం ద్వారా కొంత కాలానికి ఫండ్ జమ అవుతుంది.

ఆరు నెలల అవసరాలకు ఉండేలా చూసుకోవాలి

ఆరు నెలల అవసరాలకు ఉండేలా చూసుకోవాలి

మీరు ముందే ప్లాన్ చేసుకొని, రూ.1 లక్ష ఎమర్జెన్సీ ఫండ్ కావాలని భావిస్తే.. నెలకు ఎంత మొత్తం.. అలా ఎన్ని నెలలు జమ చేయాలో ముందే ప్లాన్ చేసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ఎమర్జెన్సీ ఫండ్.. వారి ఆదాయం, ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. ఓ వ్యక్తి కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు అవసరమైన ఎమర్జెన్సీ ఫండ్ ఉండేలా చూసుకోవాలి.

2 రకాల ఎమర్జెన్సీ ఫండ్స్

2 రకాల ఎమర్జెన్సీ ఫండ్స్

ఎమర్జెన్సీ ఫండ్‌ను కూడా రెండు రకాలుగా విభజించవచ్చు. దీర్ఘకాలిక అత్యవసర నిధులు, స్వల్పకాలిక అత్యవసర నిధి. వైద్యం, ప్రకృతి వైపరిత్యాలు వంటి వాటిని దీర్ఘకాలిక, వడ్డీలు, అప్పులు, ఎల్ఐసీ వంటి చెల్లింపుల కోసం ముందే ప్లాన్ చేసుకోవడాన్ని స్వల్పకాలిక ఎమర్జెన్సీ ఫండ్‌గా చెప్పవచ్చు.

ఎమర్జెన్సీ మనీని ఎక్కడ దాయాలి?

ఎమర్జెన్సీ మనీని ఎక్కడ దాయాలి?

మీ ఎమర్జెన్సీ ఫండ్‌ను నగదు రూపంలో లేదా బ్యాంకులోనే పూర్తిగా ఉంచరాదు. దీనిని లిక్విడ్ పాంలో మరింత రాబడి వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేయాలి. నిపుణుల సూచన మేరకు ఎమర్జెన్సీ ఫండ్‌ను డెట్ మ్యుచువల్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఆర్డీలలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here