ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

0
3


ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ముప్పూ వాటిల్ల లేదు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫలితంగా న్యూఢిల్లీలో దిగాల్సిన విమానం అమృత్ సర్ లో ల్యాండ్ అయింది సురక్షితంగా. ఆ సమయంలో అయిదుమంది పార్లమెంట్ సభ్యులు విమానంలో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎయిరిండియాకు చెందిన విమానం ఎఐ-021 ఈ మధ్యాహ్నం కోల్ కత నుంచి న్యూఢిల్లీకి బయలుదేరింది. 150 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో అయిదుమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ముగ్గురు లోక్ సభ సభ్యులు, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు. ఈ అయిదుమంది పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. కోల్ కత నుంచి దేశ రాజధానికి బయలుదేరిన విమానానికి మార్గమధ్యంలో ఇంధన కొరత ఎదురైంది.

గమ్యస్థానానికి చేరడానికి అవసరమైన ఇంధనం సరిపోదని గ్రహించిన పైలెట్లు.. విమానాన్ని దారి మళ్లించారు. నేరుగా అమృత్ సర్ కు తీసుకెళ్లారు. అమృత్ సర్ లోని శ్రీ గురురామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా విమానం ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పార్లమెంట్ సభ్యులు రోడ్డు మార్గం ద్వారా దేశ రాజధానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అమృత్ సర్ లో విమానాన్ని నింపుకోవడానికి చాలా సమయం పట్టింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here